Indian Man Arrested:చిన్నారుల లైంగిక వేధింపుల కేసు: అమెరికాలో భారతీయుడి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన ఒక వ్యక్తిని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిగా ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు. అతడు అవసరమైన చట్టబద్ధ పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించినట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని వారు సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. న్యూజెర్సీ రాష్ట్రంలో 13 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతనిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు దొంగతనాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యల్లోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
స్వదేశానికి సుమారు 3,800 మంది భారతీయ పౌరులు
అయితే ఈ కేసు ఏ ప్రాంతంలో నమోదు అయ్యింది, నిందితుడిని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు అనే పూర్తి వివరాలను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని, నిందితుడిని దేశం నుంచి బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన కారణంగా గత ఏడాది పెద్ద సంఖ్యలో భారతీయులను ఆ దేశం వెనక్కి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 3,800 మంది భారతీయ పౌరులను అమెరికా అధికారులు స్వదేశానికి తిరిగి పంపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికాలో మరో భారతీయుడి అరెస్ట్
—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13
— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026
—SHOPLIFTING
—PUBLIC DISORDER
Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey.
We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9