Sai Varshith Kandula:వైట్‌హౌస్‌పై దాడికి యత్నం.. కందుల సాయివర్షిత్‌కు 8 ఏళ్ల జైలు
ఈ వార్తాకథనం ఏంటి
2023లో అమెరికాలోని వైట్‌హౌస్ వద్ద భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్ ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ సంఘటనలో నిందితుడైన సాయి వర్షిత్‌ను అప్పట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా, ఈ కేసులో జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు ప్రకటించారు.
ఈ చర్యను నాజీ భావజాలంతో ఉద్దేశపూర్వకంగా డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంగా వారు అభిప్రాయపడినట్లు వెల్లడించారు.
వివరాలు
ఉత్తరభాగంలో ఉన్న భద్రతా కోసం ఏర్పాటుచేసిన ట్రాఫిక్ బారియర్స్ ఢీ
కోర్టు పత్రాలు తెలిపిన వివరాల ప్రకారం, 2023 మే 22 సాయంత్రం, సాయి వర్షిత్ మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుండి వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు.
అక్కడ అతడు ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని రాత్రి 9.35 గంటల సమయంలో వైట్‌హౌస్ వద్దకు వచ్చాడు.
అక్కడ సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపించడంతో పాదచారులు భయంతో పరుగులు పెట్టారు.
తర్వాత, ట్రక్కు ఉత్తరభాగంలో ఉన్న భద్రతా కోసం ఏర్పాటుచేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు.
ఆ తర్వాత వాహనాన్ని రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టిన తర్వాత, కింద కూర్చొని నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేశాడు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
జో బైడెన్ ను హత్య చేయాలనే లక్ష్యంతో..
ఈ దాడి గమనించిన, అధికారుల ప్రకారం, సాయి వర్షిత్ అధ్యక్షుడు జో బైడెన్ (President Joe Biden)ను హత్య చేయాలనే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనను జరిపినట్లు వెల్లడైంది.
ఆరు నెలలుగా ప్రణాళిక తయారుచేసిన తరువాత, అతడు ఈ దాడిని అంగీకరించాడు. ఈ విషయం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ద్వారా వెలుగులోకి వచ్చింది.