
US: అమెరికాలో భారత సంతతి నాయకుడికి గ్యాంబ్లింగ్ మాఫియాతో సంబంధాలు.. కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు ఆనంద్ షా పై గ్యాంబ్లింగ్ కేసు నమోదైంది. గ్యాంబ్లింగ్, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాల్లో షా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
39 మంది వ్యక్తులలో షా ఒకరుగా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. న్యూయార్క్ శివారులోని ప్రాస్పెక్ట్ పార్క్‌లో మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్న షా ప్రస్తుతం రెండోసారి పదవిలో కొనసాగుతున్నారు.
ఫ్లోరిడాలోని లాంగ్వుడ్‌లో నివసిస్తున్న మరో భారత సంతతికి చెందిన వ్యక్తి సమీర్ ఎస్. నాదకర్ణి కూడా గ్యాంబ్లింగ్ సంబంధిత నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.
ఈ కేసు 'లూచీస్ క్రైమ్ ఫ్యామిలీ' అనే ప్రఖ్యాత మాఫియా గ్రూప్‌తో కలసి ఆనంద్ చట్టవిరుద్ధంగా పోకర్ గేమ్స్, ఆన్‌లైన్ స్పోర్ట్స్‌బుక్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Details
నమ్మకాన్ని కోల్పోతారు
ఈ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు చట్టబద్ధంగా ఉన్న రెస్టారెంట్లు, సామాజిక క్లబ్‌ల ముసుగులో సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ప్రజల తరఫున ఎన్నికై ప్రజలకు సేవలందించాల్సిన నాయకులు ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ప్రజల్లో నాయకులపై ఉన్న నమ్మకాన్ని పోగొడుతుందని మాథ్యూ ప్లాట్కిన్ అసహనం వ్యక్తంచేశారు.