Loading...
Indian Student: సోషల్ మీడియాలో బాలికలకు వేధింపులు.. భారత విద్యార్థికి 30 ఏళ్ల జైలు
సోషల్ మీడియాలో బాలికలకు వేధింపులు.. భారత విద్యార్థికి 30 ఏళ్ల జైలు

Indian Student: సోషల్ మీడియాలో బాలికలకు వేధింపులు.. భారత విద్యార్థికి 30 ఏళ్ల జైలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూకేలో భారత విద్యార్థికి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సోషల్ మీడియా,ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను వేదికగా చేసుకుని బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. ముంబయికి చెందిన 27 ఏళ్ల బిలాల్ ఖాజీ అనే విద్యార్థి దాదాపు 180 మంది బాలికలను వేధించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల్లో ఎక్కువ మంది 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్నవారేనని అధికారులు తెలిపారు.

వివరాలు 

టీనేజీ బాలుడిలా పరిచయం.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్

పోలీసుల విచారణలో నిందితుడి నేరాలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బిలాల్ ఖాజీ సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో టీనేజీ బాలుడిలా నటించేవాడు.

క్రమంలో బాలికలతో పరిచయం పెంచుకుని, క్రమంగా వారితో స్నేహం చేసేవాడు. ఆ తర్వాత వారిని బలవంతపెట్టి అశ్లీల వీడియోలు, ఫొటోలు సేకరించేవాడు.

వాటిని బయటపెడతానంటూ బెదిరించి, బాధితులను బ్లాక్‌మెయిల్ చేసేవాడు.

తన బెదిరింపులతో బాలికలను లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేలా ఒత్తిడి చేసేవాడని పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

2021 నుంచి 2025 వరకు నేరాలు

ముంబయికి చెందిన బిలాల్ ఖాజీ యూకేలోని ఓ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

2021 నుంచి 2025 మధ్య కాలంలో అతడు ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. 2023లో ఓ బాధితురాలు బిలాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

అయితే, ఆ సమయంలో నిందితుడు తన కుటుంబ సభ్యులను కలిసేందుకు కువైట్ వెళ్లినట్లు గుర్తించారు.

అదే ఏడాది జులైలో యూకేకు తిరిగి వచ్చిన బిలాల్‌ను విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

బెయిల్‌పై బయటకు వచ్చాకా కొనసాగిన వేధింపులు

అరెస్టు అనంతరం కొంతకాలం జైలులో ఉన్న బిలాల్ ఖాజీ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఓ కళాశాలలో చేరాడు.

అయితే, బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.

టీనేజీ బాలికలను ఆన్‌లైన్‌లో వేధించడం కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో గతేడాది ఆగస్టులో మరోసారి అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ADVERTISEMENT

వివరాలు 

మొబైల్‌లో వందలాది అశ్లీల వీడియోలు

నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులకు వందల సంఖ్యలో అశ్లీల వీడియోలు, ఇతర అభ్యంతరకరమైన సమాచారం లభించింది.

అంతేకాకుండా, ఓ బాలికతో అతడు ఏకంగా 9 వేల సందేశాలు, సంభాషణలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.

ఈ కేసులో అందుబాటులో ఉన్న ఆధారాలు, నిందితుడి నేరాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తాజాగా అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ADVERTISEMENT