Iran: అమెరికా-ఇజ్రాయెల్ దాడులు: 3375 మంది పౌరులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు నలభై రోజులుగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 3375 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ మృతుల్లో 2875 మంది పురుషులు, 500 మంది మహిళలు ఉన్నారని ఇరాన్ న్యాయ వైద్య సంస్థ అధిపతి అబ్బాస్ మస్జేది అరానీ తెలిపారు. అమెరికాతో పాకిస్థాన్ వేదికగా జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన సమయంలో ఈ గణాంకాలను ఇరాన్ అధికారులు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాలు
ఒక్కరోజులోనే దాదాపు 300 మంది మృతి
ఇదిలా ఉండగా, లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తీవ్ర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు సుమారు రెండు వేల మంది మరణించినట్లు అంచనా. ఇటీవల ఒక్కరోజులోనే దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చల్లో లెబనాన్‌పై దాడుల అంశం కూడా ముఖ్యంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.