LOADING...
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వదంతులు.. ఖండించిన ఇరాన్
మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వదంతులు.. ఖండించిన ఇరాన్

Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వదంతులు.. ఖండించిన ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ సుప్రీం నేత ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో,అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఇరాన్‌ ప్రభుత్వం ఖండించింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. గత నెల 28న అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో మొజ్తబా తండ్రి,ఇరాన్‌ మాజీ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఆయన స్థానంలో మొజ్తబా ఖమేనీ ఇటీవల ఇరాన్‌ సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టారు.

వివరాలు 

ఆరోగ్యంపై పలు వదంతులు

అయితే అదే దాడిలో మొజ్తబా ఖమేనీ కాళ్లకు గాయాలు అయ్యాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. సుప్రీం నేతగా ఎన్నికైన తరువాత మొజ్తబా ఇప్పటివరకు ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. ఆయన కార్యాలయం నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు వదంతులు వ్యాపిస్తున్నాయి.

Advertisement