LOADING...
Ali Khamenei: అమెరికా దాడుల్లో ధ్వంసమైన ఖమేనీ నివాస సముదాయం.. వీడియో విడుదల చేసిన ఇరాన్
అమెరికా దాడుల్లో ధ్వంసమైన ఖమేనీ నివాస సముదాయం.. వీడియో విడుదల చేసిన ఇరాన్

Ali Khamenei: అమెరికా దాడుల్లో ధ్వంసమైన ఖమేనీ నివాస సముదాయం.. వీడియో విడుదల చేసిన ఇరాన్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తొలి రోజే అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) మరణించిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌లో ఉన్న ఆయన నివాస సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు పలువురు కీలక నాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ అంత్యక్రియలు గురువారం జరగనున్న నేపథ్యంలో, అమెరికా దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఆయన కాంపౌండ్‌కు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా తాజాగా విడుదల చేసింది. సుమారు 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో భవనం తీవ్రంగా ధ్వంసమైన పరిస్థితి స్పష్టంగా కనిపించింది.

వివరాలు

యాత్రలో పాల్గొన్న లక్షలాది మంది..

ఇదిలా ఉండగా, గత వారం రోజులుగా ఖమేనీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఇరాన్‌తో పాటు ఇరాక్‌లోని పలు నగరాల మీదుగా సాగిన ఈ యాత్రలో లక్షలాది మంది ప్రజలు పాల్గొని తమ అభిమాన నాయకుడికి తుది వీడ్కోలు పలికారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలమైన ఇరాన్‌లోని మషహద్ నగరంలో గురువారం ఖననం చేయనున్నారు.

వివరాలు

అమెరికాకు హెచ్చరిక..

అయితే మషహద్‌కు వెళ్లే మార్గంలోని రెండు కీలక వంతెనలు అమెరికా దాడుల్లో ధ్వంసమైనట్లు ఇరాన్ వెల్లడించింది. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్-మషహద్ మధ్య రైలు సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ చర్యలన్నీ ఖమేనీ అంత్యక్రియలకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతోనే అమెరికా చేపట్టిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆరోపించింది. ఇలాంటి దాడులు కొనసాగితే తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా ఉంటుందని అమెరికాను హెచ్చరించింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement