LOADING...
Trump: ఇరాన్‌ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా
ఇరాన్‌ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా

Trump: ఇరాన్‌ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ముగింపు చర్చల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. శాశ్వత శాంతి కోసం టెహ్రాన్‌ పంపిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఆ ప్రతిపాదన తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన 'ట్రూత్‌ సోషల్‌' వేదికగా స్పష్టం చేశారు. అణ్వస్త్ర తయారీ కార్యక్రమాలపై పరిమితులు విధించుకునే విషయంలో ఇరాన్‌ వెనక్కి తగ్గకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. టెహ్రాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతోందని ట్రంప్‌ పేర్కొన్నారు.

వివరాలు 

అమెరికాకు పంపిన తాజా ప్రతిపాదనపై స్పందించిన ఇరాన్ 

సోమవారం ఓవల్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ''నేను అలసిపోతానని, నాపై ఒత్తిడి పెరుగుతుందని ఇరాన్‌ నాయకత్వం భావిస్తోంది. కానీ నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం సంపూర్ణ విజయాన్ని సాధిస్తాం'' అని వ్యాఖ్యానించారు. ఇక అమెరికాకు పంపిన తాజా ప్రతిపాదనపై ఇరాన్‌ కూడా స్పందించింది. తమ దేశానికి ఉన్న చట్టబద్ధ హక్కుల పరిరక్షణ కోసమే ఆ ప్రతిపాదనలు చేశామని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయీల్‌ బఘాయీ వెల్లడించారు. శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Advertisement