LOADING...
Israel-Iran: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారం.. 70 బాలిస్టిక్ క్షిపణుల దాడి
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారం.. 70 బాలిస్టిక్ క్షిపణుల దాడి

Israel-Iran: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారం.. 70 బాలిస్టిక్ క్షిపణుల దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. శనివారం తొలుత ఇరాన్‌పై ఇజ్రాయెల్, యూఎస్ సంయుక్తంగా క్షిపణి దాడులు జరిపాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు పలు కీలక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. సుమారు 70 మిస్సైళ్లను ప్రయోగించినట్లు సమాచారం. వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థ 'ఐరన్ డోమ్'ను వినియోగిస్తోంది. ఓడరేవు నగరమైన బుషెహర్‌పై కూడా ఇరాన్ దాడులు జరిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Details

టెల్ అవీవ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ సైరన్లు మోగించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా టెల్ అవీవ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పౌరులు సురక్షిత ప్రదేశాలు, బాంబు షెల్టర్ల సమీపంలోనే ఉండాలని హెచ్చరించారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో కూడా క్షిపణి దాడులు జరిగినట్లు సమాచారం. ఖమేనీ నివాసం, హెడ్‌క్వార్టర్స్, రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ విభాగాల కార్యాలయాల సమీపంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే దాడులకు ముందుగానే ఖమేనీ బంకర్‌లోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దాడుల్లో అనేక మంది సైనికులు మరణించినట్లు సమాచారం.

Advertisement