Loading...
Pezeshkian: అమెరికాతో యుద్ధం కోరుకోవట్లేదు.. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు
అమెరికాతో యుద్ధం కోరుకోవట్లేదు.. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు

Pezeshkian: అమెరికాతో యుద్ధం కోరుకోవట్లేదు.. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని కొనసాగించాలని తమ దేశం కోరుకోవట్లేదని స్పష్టం చేశారు.అయితే.. యుద్ధం ఎప్పుడు ముగియాలనే విషయాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి యుద్ధం ముగిసే అవకాశాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై ఇరాన్‌, అమెరికా మధ్య ప్రస్తుతం ఏకాభిప్రాయం లేదని పెజెష్కియాన్‌ తెలిపారు. అదే సమయంలో అమెరికా ఒత్తిడికి టెహ్రాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోదని స్పష్టం చేశారు. ఇరాన్‌లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతూ అమెరికా,ఇజ్రాయెల్‌,యూరప్‌ దేశాల నాయకులు తమ దేశంలో అశాంతి పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

వివరాలు 

ఇరుపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు

ఇరాన్‌కు అయినా.. అమెరికాకు అయినా సంఘర్షణల వల్ల ప్రయోజనం ఉండదని పెజెష్కియాన్‌ వ్యాఖ్యానించారు.

ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే.. యుద్ధాన్ని ముగించే విధానంపై ఇరుపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

వివరాలు 

కొనసాగుతున్న హూతీల దాడులు..

అమెరికా-ఇరాన్‌ మధ్య ఘర్షణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేస్తున్నారు.

తాజాగా సౌదీ రాజధాని రియాద్‌తో పాటు పలు ప్రాంతాలను హూతీలు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.

సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో రిఫైనరీపైనా డ్రోన్‌, క్షిపణి దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

రాస్‌ తనురాలో ఉన్న ఈ రిఫైనరీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు హూతీ సైనిక ప్రతినిధి వెల్లడించారు.

ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

కొనసాగుతున్న హూతీల దాడులు..

మరోవైపు.. దక్షిణ తైఫ్‌ ప్రావిన్స్‌, ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల వైపు హూతీలు ప్రయోగించిన ఆరు బాలిస్టిక్‌ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.

వరుస దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో పాటు పలు ప్రాంతాలకు సౌదీ అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తోడు హూతీల దాడులు కూడా తీవ్రతరం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT