Loading...
Iran: అమెరికా అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ తెరుస్తాం.. ఇరాన్ ప్రకటన
అమెరికా అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ తెరుస్తాం.. ఇరాన్ ప్రకటన

Iran: అమెరికా అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ తెరుస్తాం.. ఇరాన్ ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అంగీకరిస్తే రెండు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. తమ డిమాండ్లకు అమెరికా అంగీకారం తెలిపితే ఈ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికాతో మధ్యవర్తుల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. అయితే తదుపరి చర్చలు, ఒప్పందాలన్నీ అమెరికా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

ఇరాన్ డిమాండ్లు ఇవే..

మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించాలని ఇరాన్ కోరుతోంది. అలాగే స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, చమురు రంగంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

మరోవైపు హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల కోసం ఇరాన్, ఒమన్ అంగీకరించిన కొత్త మార్గాన్ని అమెరికా గుర్తించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కోరారు.

వివరాలు 

అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఆందోళనలు

ఇదిలా ఉండగా, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేసే అవకాశాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇరాన్‌పై దాడులు చేపట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హార్ముజ్ జలసంధి మీదుగానే జరుగుతుంది.

ఈ మార్గంలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అందుకే ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న చర్చలు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ADVERTISEMENT