LOADING...
Hormuz closed: హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన ఆందోళనలు
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన ఆందోళనలు

Hormuz closed: హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన ఆందోళనలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 12, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌక హర్మూజ్ జలసంధిలో అనుమతిలేని మార్గాన్ని ఉపయోగించిందని ఆరోపించిన ఇరాన్ సైన్యం దానిపై కాల్పులకు దిగింది. ఈ ఘటన అనంతరం హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో నౌకలో పనిచేస్తున్న ఒక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధ్రువీకరించింది. ఇరాన్ తీసుకున్న ఈ చర్య తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, ఆ నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్‌పై అమెరికా సైనికచర్యలు మరింత విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళన గల్ఫ్‌తో పాటు పశ్చిమాసియా దేశాల్లో వ్యక్తమవుతోంది.

వివరాలు

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు..

హర్మూజ్ తీర ప్రాంతంలోని రెండు పట్టణాలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల కారణంగా దాదాపు పది ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ వెల్లడించింది. మరోవైపు, టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని మూడో విడత వైమానిక దాడులను విజయవంతంగా పూర్తి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 140 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా వెల్లడించింది. బుషెహర్ ప్రావిన్స్‌లో నిర్వహించిన దాడుల్లో ఒక సైనిక స్థావరంతో పాటు పలు కీలక ప్రాంతాలు దెబ్బతిన్నట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను అత్యంత అప్రమత్త స్థితిలో ఉంచినట్లు ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొంది.

Advertisement