LOADING...
Iran: ఖమేనీకి వ్యతిరేక ఉద్యమాన్ని అణచడానికి ఉరిశిక్షలు.. 26 ఏళ్ల నిరసనకారుడికి మరణశిక్ష విధింపు.. 
26 ఏళ్ల నిరసనకారుడికి మరణశిక్ష విధింపు..

Iran: ఖమేనీకి వ్యతిరేక ఉద్యమాన్ని అణచడానికి ఉరిశిక్షలు.. 26 ఏళ్ల నిరసనకారుడికి మరణశిక్ష విధింపు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా అణచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వందలాది మంది ఇప్పటికే మరణించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిరసనలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నది. తాజాగా, ఇరాన్ అధికారులు మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 26 ఏళ్ల ఎర్ఫాన్ సొల్తానీపై త్వరలో మరణశిక్ష అమలు కానుందని సమాచారం.

వివరాలు 

అసమ్మతిని అణిచివేయడానికి ఉరిశిక్ష ఒక సాధానం

టెహ్రాన్‌కి సమీపంలోని కరాజ్ ప్రాంతంలోని ఫర్డిస్ నివాసి సొల్తానీని, జనవరి 8న దేశవ్యాప్తంగా వ్యాపించిన అలీ ఖమేనీ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం, బుధవారం అతడికి ఉరిశిక్ష విధించనున్నారు. ఇరాన్‌లో గతంలో కూడా అసమ్మతిని అణిచివేయడానికి ఉరిశిక్షను ఒక సాధానంగా వాడుకుంది. ఈసారి చెలరేగుతున్న ఆందోళనల్లో మొదటి ఉరిశిక్ష సొల్తానీదే. రణశిక్షలు విధించడం ద్వారా ఉద్యమకారుల్ని భయపెట్టాలని ఖమేనీ సర్కార్ భావిస్తోంది.

వివరాలు 

కుటుంబ సభ్యులు కలుసుకోడానికి 10 నిముషాలు 

అరెస్ట్ అయినప్పటి నుంచి సొల్తానీకి న్యాయవాదిని సంప్రదించే హక్కు, తన వాదనలను వినిపించుకునే హక్కులు నిరాకరించబడ్డాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి అరెస్ట్ తర్వాత అధికారులు కుటుంబానికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. జనవరి 11న అతడికి మరణశిక్ష విధించబోయే విషయాన్ని మాత్రమే కుటుంబానికి తెలియజేశారు. మరణశిక్ష వివరాలు తెలుసుకున్న తర్వాత, కేవలం 10 నిమిషాలపాటు మాత్రమే కుటుంబ సభ్యులు అతడిని కలిసే అవకాశం పొందినట్లు తెలిసింది.

Advertisement