Loading...
Iran: ట్రంప్ ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్ రహస్య వ్యూహం.. 5 వేల సంస్థలతో భారీ నెట్‌వర్క్‌!
5 వేల సంస్థలతో భారీ నెట్‌వర్క్‌!

Iran: ట్రంప్ ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్ రహస్య వ్యూహం.. 5 వేల సంస్థలతో భారీ నెట్‌వర్క్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్‌.. మరోవైపు తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనాన్ని తప్పించుకుంటూ భారీగా ఆయుధ తయారీకి అవసరమైన ముడిసరుకులు, సైనిక సామగ్రిని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం ఏకంగా 5 వేలకు పైగా సంస్థలతో కూడిన రహస్య అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు రాయిటర్స్‌ తన తాజా పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. 2025 జనవరి నుంచి 2026 జూన్‌ వరకు ఈ వ్యవస్థ ద్వారా 2 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన సైనిక సామగ్రిని ఇరాన్‌ దిగుమతి చేసుకున్నట్లు గుర్తించింది.

వివరాలు 

IRGC తోనూ సంబంధాలు

ఇరాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ (MOD) పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న 5,000కుపైగా సంస్థలు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు రాయిటర్స్‌ పరిశోధనలో తేలింది.

వీటన్నింటికీ టెహ్రాన్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ చిరునామానే ఉన్నట్లు గుర్తించారు.

విదేశాల నుంచి వస్తువుల కొనుగోలు, ఆర్థిక లావాదేవీలు, సైనిక అవసరాలకు సంబంధించిన దిగుమతులను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి.

అంతేకాకుండా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC)తోనూ వీటికి సంబంధాలు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

వివరాలు 

ఒక్క సంస్థ ద్వారానే 2.3 బిలియన్‌ డాలర్ల దిగుమతులు

ఈ రహస్య నెట్‌వర్క్‌లో MOD 346428 అనే సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాయిటర్స్‌ గుర్తించింది.

2025 జనవరి నుంచి 2026 జూన్‌ మధ్య ఈ ఒక్క సంస్థ ద్వారానే 2.3 బిలియన్‌ డాలర్ల విలువైన సైనిక సామగ్రి దిగుమతులు జరిగినట్లు రికార్డులు వెల్లడించాయి.

రాకెట్‌ ఇంధనం తయారీకి అవసరమైన రసాయనాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాల విడిభాగాలు, విమాన ఇంజిన్లకు సంబంధించిన భాగాలు, భారీ ట్రక్కులు ఇందులో ఉన్నాయి.

చైనా, రష్యా, జర్మనీ సహా పలు దేశాల నుంచి ఈ సామగ్రి ఇరాన్‌కు చేరినట్లు పత్రాల ద్వారా తెలిసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఒక్క సంస్థ ద్వారానే 2.3 బిలియన్‌ డాలర్ల దిగుమతులు

మరోవైపు విదేశాల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు ఇరాన్‌ నేరుగా నగదు బదిలీలు చేయడం లేదు.

ఇతర దేశాల్లోని మధ్యవర్తులు, షెల్‌ కంపెనీలను ఉపయోగించుకుంటోంది. రాయిటర్స్‌ పరిశీలించిన దిగుమతి లావాదేవీల్లో 97 శాతం చెల్లింపులు ఎలాంటి కరెన్సీ బదిలీ లేకుండానే పూర్తయినట్లు గుర్తించింది.

అక్రమంగా చమురు విక్రయించడం ద్వారా విదేశాల్లో సంపాదించిన డబ్బుతో అక్కడే అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి, వాటిని ఇరాన్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

భారీ ట్రక్కులనే క్షిపణి ప్రయోగ వాహనాలుగా..

ఇరాన్‌ దిగుమతులు కేవలం ఆయుధ విడిభాగాలు, రసాయనాలకే పరిమితం కాలేదు.

సైనిక అవసరాలకు ఉపయోగపడే భారీ వాహనాలను కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తోంది.

2025 జనవరి నుంచి 2026 జూన్‌ మధ్య ఏకంగా 435 ఐవెకో ట్రక్కులను దిగుమతి చేసుకుంది.

వీటితోపాటు టయోటా హైలక్స్‌, ల్యాండ్‌ క్రూయిజర్‌, టండ్రా వాహనాలను కూడా కొనుగోలు చేసింది.

బయటకు సాధారణ వాహనాల్లా కనిపించే ఈ ట్రక్కులను అవసరమైతే క్షిపణి ప్రయోగ వాహనాలుగా మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

భారీ ట్రక్కులనే క్షిపణి ప్రయోగ వాహనాలుగా..

2026 ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌లోని క్షిపణులు, డ్రోన్ల తయారీ కేంద్రాలపై దాడులు చేశాయి.

అదే సమయంలో అమెరికా నౌకాదళం ఇరాన్‌ నౌకా రవాణాపై దిగ్బంధనాన్ని కొనసాగించింది.

అయినప్పటికీ ఆ దేశం సైనిక సామగ్రి దిగుమతులను పూర్తిగా నిలిపివేయలేదు.

యుద్ధం కారణంగా మార్చి నెలలో దిగుమతులు 47 శాతం తగ్గి 5.4 కోట్ల డాలర్లకు చేరాయి.

అయితే మే నాటికి మళ్లీ పుంజుకుని 7.7 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఈ సమయంలో రష్యా నుంచి డిటోనేటర్లు, ఇతర దేశాల నుండి నుంచి రాకెట్‌ ఇంధన తయారీకి ఉపయోగించే రసాయనాలు, టైటానియం వంటి పదార్థాలు ఇరాన్‌కు చేరినట్లు రికార్డులు వెల్లడించాయి.

వివరాలు 

బ్యాంకు పత్రాల పరిశీలనతో బయటపడిన రహస్య వ్యవస్థ

ఇరాన్‌ ప్రభుత్వ రంగానికి చెందిన సెపా బ్యాంకులోని వేలాది పత్రాలను పరిశీలించిన 240 అనలిటిక్స్‌ సంస్థ ఈ రహస్య దిగుమతుల వ్యవస్థను గుర్తించింది.

2024 చివరి నాటికే ఈ నెట్‌వర్క్‌కు చెందిన 36 సంస్థల విదేశీ మారక ఖాతాల్లో 1.2 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు బ్యాంకు రికార్డులు వెల్లడించాయి.

ఈ సమాచారాన్ని బ్యాంకు ఖాతాల వివరాలు, దిగుమతి పత్రాలు, కంపెనీల రిజిస్ట్రేషన్‌ రికార్డులతో పోల్చి రాయిటర్స్‌ తన పరిశోధనను కొనసాగించింది.

ఈ నెట్‌వర్క్‌ ఇరాన్‌ సైనిక వ్యవస్థకు ఆర్థికంగా కీలకమైన వెన్నెముకలా పనిచేస్తోందని అమెరికా ట్రెజరీ శాఖ మాజీ అధికారి మియాద్‌ మాలెకీ అభిప్రాయపడ్డారు.

అయితే రాయిటర్స్‌ పరిశోధనలో వెల్లడైన అంశాలపై ఇరాన్‌ ప్రభుత్వ సంస్థలు ఇప్పటివరకు స్పందించలేదు.

వివరాలు 

బ్యాంకు పత్రాల పరిశీలనతో బయటపడిన రహస్య వ్యవస్థ

మొత్తంగా అమెరికా ఆంక్షలు, యుద్ధ పరిస్థితులు, నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్‌ తన సైనిక అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు ఈ పరిశోధన వెల్లడిస్తోంది.

ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన ముడిసరుకులు, విడిభాగాలను రహస్య నెట్‌వర్క్‌ ద్వారా సమకూర్చుకుంటూ తన సైనిక సామర్థ్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT