LOADING...
Iran war impact: కరోనా వేవ్ అనంతరం.. తొలిసారి మందగమనంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం
కరోనా వేవ్ అనంతరం.. తొలిసారి మందగమనంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం

Iran war impact: కరోనా వేవ్ అనంతరం.. తొలిసారి మందగమనంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఇరాన్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా తర్వాత ఊపందుకున్న ఇళ్ల ధరలు ఇప్పుడు మొదటిసారి తగ్గుముఖం పట్టాయి. విదేశీ పెట్టుబడిదారులు, ధనిక ప్రవాసులు భారీగా పెట్టుబడులు పెట్టడంతో దుబాయ్ హౌసింగ్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న హౌసింగ్ మార్కెట్‌గా మారింది. అయితే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా డిమాండ్ తగ్గి ధరలు పడిపోతున్నాయి. వాల్యూస్ట్రాట్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మార్చిలో ఇళ్ల ధరల సూచీ 5.9 శాతం పడిపోయింది. 2020 తర్వాత తొలిసారిగా ఇళ్ల ధరలు తగ్గాయిఅయితే ఈ తగ్గుదలతో ధరలు ఆరు నెలల క్రితం ఉన్న స్థాయికే చేరాయి.

వివరాలు 

దుబాయ్ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం

ఇదే సమయంలో ఇళ్ల విక్రయాల విలువ కూడా గణనీయంగా తగ్గింది. లావాదేవీలు సుమారు 16 వేల నుంచి 13 వేల వరకు పడిపోయాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో గల్ఫ్ దేశాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారుల నమ్మకం దెబ్బతింది. దీంతో దుబాయ్ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జనాభా పెరుగుదల కూడా గతంలా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈద్ పండుగ, భారీ వర్షాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు సంస్థలు చెబుతున్నాయి. వేసవిలో మరింత సవాళ్లు ఉండొచ్చని అంచనా. అయితే దీర్ఘకాల వీసాల ద్వారా విదేశీయులను ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు

దీంతో మార్కెట్‌కు కొంత స్థిరత్వం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు యుద్ధం తర్వాత షేర్ మార్కెట్‌లో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మళ్లీ కోలుకుంటున్నాయి. 2009లో వచ్చిన సంక్షోభం లాంటి పరిస్థితి ఇప్పుడేమీ కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులు కొనసాగుతుండగా.. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నారు. మొత్తంగా చూస్తే డిమాండ్ కొంత తగ్గినా, మార్కెట్ పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement