Loading...
US-Iran War: పశ్చిమాసియాకు అమెరికా మూడో యుద్ధ నౌక.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడి తప్పదా?
పశ్చిమాసియాకు అమెరికా మూడో యుద్ధ నౌక.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడి తప్పదా?

US-Iran War: పశ్చిమాసియాకు అమెరికా మూడో యుద్ధ నౌక.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడి తప్పదా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై మరోసారి అమెరికా భారీ దాడికి సిద్ధమవుతోందా? పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలగాల మోహరింపు తాజా పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. నవంబరు 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై కొత్త దాడులు జరిగే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అమెరికా పశ్చిమాసియాకు భారీగా బలగాలను తరలిస్తోంది.

వివరాలు 

మూడో యుద్ధ నౌకతో పాటు 10 వేల మంది సైనికులు

అమెరికా తన మూడో విమానవాహక నౌక USS థియోడోర్ రూజ్‌వెల్ట్‌ను దాని స్ట్రైక్ గ్రూప్‌తో కలిసి పశ్చిమాసియాకు పంపుతోంది.

దాదాపు 9,000 నుంచి 10,000 మంది సైనికులు కూడా ఈ ప్రాంతానికి తరలించనున్నారు.

USS థియోడోర్ రూజ్‌వెల్ట్ నవంబరు నెలాఖరు నాటికి పశ్చిమాసియాకు చేరుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే USS జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్, USS జార్జ్ వాషింగ్టన్ అనే రెండు అమెరికా విమానవాహక నౌకలు పశ్చిమాసియాలో విధులు నిర్వహిస్తున్నాయి.

తాజాగా మరో విమానవాహక నౌక, వేలాది మంది సైనికుల మోహరింపుతో ఈ ప్రాంతంలో అమెరికా నౌకాదళ బలం మరింత పెరగనుంది.

మొత్తంగా 20,000 మందికి పైగా నావికులు, మెరైన్లు, వందలాది యుద్ధ విమానాలు అక్కడ అందుబాటులో ఉండనున్నాయి.

వివరాలు 

ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్

ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఖతార్, పాకిస్థాన్‌లు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఖతార్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ తీవ్రంగా నష్టపోతున్నందువల్లే హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవడానికి ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.

అమెరికా దాడులను నిలిపివేయడంతో పాటు తమ పోర్టులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే హర్మూజ్ జలసంధిని తెరవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రతిపాదించింది.

అయితే ఈ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ట్రంప్ అనుమానాలు

మరోవైపు.. బుధవారం ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనపై కూడా ట్రంప్ స్పందించారు.

విమాన కెప్టెన్‌పై కో-పైలట్ దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు ఇరాన్ బాధ్యత వహించినట్లు తేలితే ప్రతీకారం అత్యంత తీవ్రంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

ఒమన్ జాతీయుడైన కో-పైలట్‌ను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) పంపించి ఉండొచ్చా? లేదా అతడు తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై ఈ చర్యకు పాల్పడ్డాడా? అని మీడియా ప్రశ్నించగా.. అలా జరిగి ఉండే అవకాశం ఉందని ట్రంప్ సమాధానమిచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ట్రంప్ అనుమానాలు

అయితే, ఈ విమాన ఘటనలో ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు బయటకు రాలేదు.

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో మొత్తం 180 మంది ఉన్నారు.

వారిలో 170 మంది ప్రయాణికులు కాగా, మిగిలినవారు సిబ్బంది. ఈ విమానానికి ఒమన్ జాతీయుడైన వ్యక్తి కో-పైలట్‌గా ఉన్నాడు.

అతడు కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ADVERTISEMENT