Ismail Khatib :ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ మృతి.. ఇజ్రాయెల్ ధృవీకరణ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 18, 2026
05:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వైమానిక దాడులు కొనసాగించాయి. ఈ దాడులలో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ హతమైనట్లు ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇస్మాయిల్ ప్రకారం ఖాతిబ్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి. అయితే, ఇరాన్ ఇంకా ఖాతిబ్ మరణాన్ని ధ్రువీకరించలేదు. ఇదే సమయంలో, ఇరాన్‌లో ఇప్పటికే మరణించిన అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ మరణించిన తర్వాత, ఇజ్రాయెల్ మరో కీలక నేతను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులు నిర్వహించింది.