
గాజాలోని హమాస్ స్థావరాలపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నాం: ఇజ్రాయెల్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై భీకర దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.
హమాస్ లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్ నేపథ్యంలో గాజాలోని ప్రజలకు ఐడీఎఫ్ కీలక సూచనలు చేసింది.
తమకు హమాస్ మిలిటెంట్ల సమాచారాన్ని అందించాలని ఐడీఎఫ్ కోరింది.
సమాచారం అందించిన వారికి తగిన నగదు ప్రోత్సాహం ఉంటుందని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
హమాస్ ఉగ్రవాదుల వద్ద 220మంది బంధీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.
ఈ క్రమంలో వారిని విడిపించేందుకు సహకరించాలని గాజాలోని ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం కోరింది.
అయితే ఎప్పుడు దాడి చేస్తామనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
హమాస్
హమాస్‌ను పూర్తిగా అణిచివేసే వరకు పోరాటం ఆగదు: నెతన్యాహు
హమాస్ మిలిటెంట్లు తమ వద్ద బంధీలుగా ఉన్న వారిని విడతల వారీగా విడుదల చేస్తున్నారు. మొదట ఇద్దరు అమెరికన్ మహిళలను విడుదల చేసిన తర్వాత, సోమవారం మరో ఇజ్రాయెల్ మహిళలను రిలీజ్ చేశారు.
త్వరలోనే మరో 50మంది బందీలను హమాస్ మిలిటెంట్లు విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
బంధీలను విడిచిపెట్టినా, హమాస్‌పై తమ పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ చెబుతోంది.
గాజా సరిహద్దులో తాము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి చెప్పారు.
హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు.
ఇజ్రాయెల్‌కు ఇప్పుడు ఒకటే పని ఉందని, హమాస్‌ను పూర్తిగా అణిచివేసే వరకు తమ పోరాటం అగదన్నారు.