LOADING...
Israel strike on Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి.. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి.. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి

Israel strike on Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి.. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి చేపట్టినట్లు రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. దేశ భద్రతకు ఉన్న ముప్పులను తొలగించేందుకు ఈ చర్య తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై ఉన్న బెదిరింపులను నివారించేందుకు ఇరాన్‌పై ముందస్తు దాడి ప్రారంభించాం. దేశవ్యాప్తంగా తక్షణ అత్యవసర పరిస్థితిని ప్రకటించామని కాట్జ్ తెలిపారు. ఇక ఇదే సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. పౌరులు అప్రమత్తంగా ఉండాలని హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచించింది.

Details

అత్యవరసమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు

ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తమకు సమీపంలో ఉన్న రక్షిత స్థలాన్ని గుర్తించుకోవాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని హెచ్చరిక జారీ చేసింది. అయితే, ప్రస్తుతం షెల్టర్లలోకి వెళ్లాల్సిన అవసరం లేదని సైన్యం స్పష్టం చేసింది. క్షిపణి దాడుల అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడానికే ఈ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement