LOADING...
Israel: ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్
ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్

Israel: ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ కొత్త కుట్రకు సంబంధించిన సమాచారం తమకు లభించినట్లు ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా జరిగిన పరస్పర దాడుల నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ సమాచారం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ట్రంప్‌పై హత్యాయత్నానికి సంబంధించిన సమాచారం గత కొంతకాలంగా అమెరికా నిఘా సంస్థల దృష్టిలో ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ తాజాగా అందించిన సమాచారం మాత్రం ఒక ప్రత్యేక కుట్రకు సంబంధించినదిగా ఉందని పేర్కొంది. ఈ ఇంటెలిజెన్స్‌ను అమెరికా అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

ఇరాన్ సైనికాధికారి ఖాసెం సోలేమానీ హత్యకు ప్రతీకారం  

2020 జనవరిలో తన తొలి అధ్యక్ష పదవీకాలంలో ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ సైనికాధికారి ఖాసెం సోలేమానీ హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. ఈ వార్తలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించగా, వైట్ హౌస్ అధికారులు ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నాటో సదస్సు ముగించుకుని అమెరికాకు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, "అమెరికా నాయకుడిని అంటే నన్నే లక్ష్యంగా చేసుకోవాలని వారు చూస్తున్నారు. వారి జాబితాలో నేను ఉన్నాను. ఈ ఉదయం చూసినా ప్రతి జాబితాలో నా పేరే కనిపించింది" అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

బ్రిటన్‌లో మానం మార్చుకుని అమెరికాకు ట్రంప్ 

ఇదిలా ఉండగా,టర్కీలో జరిగిన నాటో సదస్సు నుంచి తిరుగు ప్రయాణంలో ట్రంప్, ఖతార్ నుండి బహుమతిగా అందుకున్న కొత్త అధ్యక్ష విమానాన్ని ఉపయోగించకుండా, పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లోనే ప్రయాణించడం చర్చనీయాంశమైంది. కొత్త విమానాన్ని ముందుగానే బ్రిటన్‌కు పంపించి, అక్కడి నుంచి మరోసారి విమానం మార్చుకుని అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. కొత్త విమానంలో భద్రతా వ్యవస్థలపై సందేహాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి.

Advertisement

వివరాలు 

భద్రతా కారణాలతో విమానం మార్చినట్లు తెలిపిన అమెరికా మీడియా

ముఖ్యంగా టర్కీ సరిహద్దులోని ఇరాన్‌పై అమెరికా తాజా దాడుల తర్వాత భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ సూచనల మేరకే భద్రతా కారణాలతో విమానం మార్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అయితే ఈ అంశంపై జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లపై నేరుగా స్పందించకుండా, గతంలో ఇరాన్ నుంచి తనకు వచ్చిన ముప్పును మాత్రమే ప్రస్తావించారు.

Advertisement