Page Loader
Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. 19 మంది పౌరులు మృతి
గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. 19 మంది పౌరులు మృతి

Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. 19 మంది పౌరులు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రంగా కొనసాగుతోంది. దీనివల్ల గాజా ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మరణించారు. అధికారుల నివేదిక ప్రకారం వేలాది మంది ఈ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. వారం రోజులుగా ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల్లో 150 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Details

42 వేల మంది  పాలస్తీనియన్లు మృతి

ఇలాంటి పరిస్థితుల్లో హమాస్‌ అంతర్గత మంత్రిత్వశాఖ నివాసితులకు ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య సంచారం చేయకుండా హెచ్చరికలు జారీ చేసింది. సురక్షితంగా అనుకున్న ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతున్నాయని హమాస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ సైన్యం పౌర ప్రాంతాలను దాడుల కోసం ఉపయోగించడం హమాస్ తీవ్రంగా విమర్శించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం ఇజ్రాయెల్‌ దాడుల వల్ల ఇప్పటివరకు 42 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.