GSLV-F17,EOS-05: శ్రీవారి పాదాల చెంత జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 నమూనా రాకెట్.. ప్రత్యేక పూజలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు మార్గం ద్వారా ఆనంద నిలయానికి చేరుకున్న ఆయన.. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17, ఈఓఎస్-05 నమూనా రాకెట్లను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు నారాయణన్‌కు ఆశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థప్రసాదాలను కూడా ఆయనకు అందజేశారు. సెప్టెంబర్ 4న ప్రయోగం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17ను ప్రయోగించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెప్టెంబర్ 4న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం.. శ్రీవారి చెంత నమూనా రాకెట్
Tirumala, Andhra Pradesh: ISRO Chairman Dr V. Narayanan says, "We at ISRO are proud to announce that we are going to launch Earth Observation Satellite-05 using the GSLV-F17 vehicle on September 4 at 2:55 AM. This will be the first Earth Observation Satellite to be placed in the… pic.twitter.com/S2Dx8e3PtS
— IANS (@ians_india) September 2, 2026