Page Loader
Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్
డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్

Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరుకానున్నారు. ట్రంప్‌ ప్రమాణస్వీకార నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి జైశంకర్‌ ఒక రోజు ముందు అమెరికాకు వెళ్లనున్నారు. భారత విదేశాంగ శాఖ ఈ విషయాన్ని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వెల్లడించింది. జైశంకర్‌ కేవలం ట్రంప్‌ ప్రమాణస్వీకారంలో పాల్గొనడానికి మాత్రమే కాకుండా, కొత్తం ప్రభుత్వంతో చర్చలు కూడా జరపుతారన్నారు.

Details

ఇతర దేశాల నేతలతో చర్చించే అవకాశం

ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ఇతర దేశాల నేతలతో కూడా జైశంకర్‌ చర్చలు జరిపే అవకాశం ఉందన్నారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించారని 6వ తేదీన అమెరికన్‌ కాంగ్రెస్‌ సర్టిఫై చేసింది. ట్రంప్‌కు 312 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. ఇంతటితో డెమోక్రాట్స్‌ అభ్యర్థి కమలాహారిస్‌కు 226 ఓట్లు వచ్చాయి. తాజా చర్చలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు విశేషంగా చర్చనీయాంశమయ్యాయి.