Loading...
Jake Lang: అమెరికాలో దీపావళి సంబరాలను అడ్డుకున్న మితవాద కార్యకర్త జేక్ ల్యాంగ్.. హిందువులపై జాతివివక్ష వ్యాఖ్యలు!
హిందువులపై జాతివివక్ష వ్యాఖ్యలు!

Jake Lang: అమెరికాలో దీపావళి సంబరాలను అడ్డుకున్న మితవాద కార్యకర్త జేక్ ల్యాంగ్.. హిందువులపై జాతివివక్ష వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని సియాటిల్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన మితవాద కార్యకర్త జేక్ ల్యాంగ్ తన అనుచరులతో కలిసి దీపావళి సంబరాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. హిందువులు, భారతీయులకు వ్యతిరేకంగా అవమానకర వ్యాఖ్యలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించాడు. దీంతో అక్కడున్న కొందరు వ్యక్తులు అతడిని, అతడి అనుచరులను అడ్డుకున్నారు. ఈ పరిణామంతో వేడుకల ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.

వివరాలు 

హిందువులే లక్ష్యంగా విమర్శలు!

దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఫొటోలను జేక్ ల్యాంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేశాడు.

ఈ సందర్భంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

టెక్సాస్ రాష్ట్రం నీలం రంగులోకి మారడానికి అమెరికాలోని హిందువులే కారణమని ఆరోపించాడు.

డెమొక్రాట్ల విజయానికి హిందువుల ఓట్లే కారణమనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

సియాటిల్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో యాంటిఫా కార్యకర్తలు, హిందువులు కలిసి తనపై దాడి చేశారని కూడా ఆరోపించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హిందువులపై జేక్ ల్యాంగ్ విద్వేష వ్యాఖ్యలు

ADVERTISEMENT

వివరాలు 

నాలుగేళ్ల జైలు శిక్ష.. ట్రంప్ క్షమాభిక్షతో విడుదల

జేక్ ల్యాంగ్ 'వైట్ రీప్లేస్‌మెంట్' పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు.

2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో అతడికి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.

అయితే, 2025లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ల్యాంగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు.

దీంతో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హిందువులు డెమొక్రాట్లకు ఓటు వేశారంటూ ఆరోపిస్తూ సియాటిల్‌లో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు ల్యాంగ్ ప్రయత్నించాడు.

అయితే, అక్కడి హిందూ సమాజానికి చెందిన వ్యక్తులు అతడి ప్రయత్నాలను అడ్డుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

దీపావళి వేడుకల్లో పాల్గొన్న వాషింగ్టన్ గవర్నర్

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో భారతీయ పారిశ్రామికవేత్త విశాల్ గోండల్, చెఫ్ వికాస్ మెహతా తదితరులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది.

వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ కూడా భారత కాన్సుల్ జనరల్‌తో కలిసి శాసనసభ భవనంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు ద్వారా వెల్లడించారు.

శాసనసభ భవనంలో భారత కాన్సుల్ జనరల్‌తో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఫెర్గూసన్ పేర్కొన్నారు.

అమెరికాలో అత్యధికంగా భారతీయ అమెరికన్లు నివసిస్తున్న రాష్ట్రాల్లో వాషింగ్టన్ ఒకటని తెలిపారు.

వివరాలు 

జేక్ ల్యాంగ్ చర్యలపై భారతీయ అమెరికన్ల ఆగ్రహం

గత పదేళ్లలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమ రాష్ట్రంలో భారతీయ అమెరికన్ల జనాభా అత్యంత వేగంగా పెరిగిందని చెప్పారు.

ఈ కమ్యూనిటీ వాషింగ్టన్ అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు.

సియాటిల్ దీపావళి వేడుకల్లో జేక్ ల్యాంగ్, అతడి అనుచరులు ప్రదర్శించిన విద్వేషపూరిత వైఖరిపై కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ సహా పలువురు భారతీయ అమెరికన్లు తీవ్రంగా స్పందించారు.

ఈ జాత్యహంకార ప్రదర్శన పట్ల తనకు తీవ్ర అసహ్యం కలిగిందని ప్రమీలా జయపాల్ పేర్కొన్నారు.

దీపావళి ఎంతో ముఖ్యమైన పండగని, ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా జరుపుకోవాలని అన్నారు.

వివరాలు 

జేక్ ల్యాంగ్ చర్యలపై భారతీయ అమెరికన్ల ఆగ్రహం

ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు సియాటెల్‌లోనే కాకుండా అమెరికాలో ఎక్కడా చోటు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.

ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భూటోరియా కూడా జేక్ ల్యాంగ్ చర్యలను తీవ్రంగా ఖండించారు.

ఈ ఘటనను మూర్ఖత్వంతో కూడిన చర్యగా అభివర్ణించారు.హిందువులపై జాత్యహంకార వ్యాఖ్యలు, దూషణలకు అమెరికాలో స్థానం లేదని స్పష్టం చేశారు.

దీపావళి అంటే వెలుగులు,సంతోషాలను పంచుకునే పండగని.. బెదిరింపులకు పాల్పడే సందర్భం కాదని పేర్కొన్నారు.

హిందూ అమెరికన్లు, భారతీయ వలసదారులను జాతిపరమైన దూషణలు,కుట్రపూరిత వ్యాఖ్యలతో లక్ష్యంగా చేసుకోవడాన్ని సహించబోమని భూటోరియా అన్నారు.

జాతి వివక్షకు తాము వ్యతిరేకమని,అమెరికాలో ప్రతి ఒక్కరికీ తమ పండగలను స్వేచ్ఛగా జరుపుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT