Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉంది. రైలు హైజాక్, సైనిక శిబిరంపై దాడి తర్వాత, ఆదివారం రాత్రి బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు జరిగాయి.
జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI) సీనియర్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించారు.
ఈ కాల్పుల్లో నూర్జాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
వివరాలు
జమియాత్ నాయకుడు నూర్జాయ్ ఎవరు?
నూర్జాయ్ ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడిగా పరిగణించబడ్డాడు. JUI సీనియర్ నాయకులలో ఆయన కూడా ఉన్నారు. నెల రోజుల్లో ఓ ప్రముఖ నేత హత్యకు గురికావడం ఇది మూడోసారి.
కొద్ది రోజుల క్రితం, మార్చి 9న బలూచిస్తాన్‌లోని టర్బత్ నగరంలో ముఫ్తీ షా మీర్‌ను ముష్కరులు హతమార్చారు. మసీదు వెలుపల అతనిపై కాల్పులు జరిపారు.
అంతకు ముందు ఫిబ్రవరి 28న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నౌషేరా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తాలిబాన్ మద్దతుదారు మౌలానా హమీదుల్ హక్ హక్కానీ మరణించాడు.
వివరాలు
బలూచిస్థాన్,ఖైబర్ పఖ్తుంక్వాలో పెరిగిన హింస
పాకిస్థాన్‌లోని సమస్యాత్మకమైన బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో నిరంతరం హింస ప్రజ్జ్వరిల్లుతోంది.
బలూచిస్థాన్‌లో, రైలును హైజాక్ చేసిన తరువాత మార్చి 16న నోష్కీలో పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై బలూచ్ యోధులు దాడి చేశారు. 90 మంది జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.
గతంలో ఖైబర్ ఫక్తున్ఖ్వాలో, ట్యాంక్ జిల్లాలోని జండోలాలో పాకిస్తాన్ సైనిక శిబిరంపై తాలిబాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.