Loading...
Donald Trump: బాధ్యతలు చేపట్టి ఐదు రోజులే.. కేటీ జకారియాను తొలగించిన ట్రంప్?
బాధ్యతలు చేపట్టి ఐదు రోజులే.. కేటీ జకారియాను తొలగించిన ట్రంప్?

Donald Trump: బాధ్యతలు చేపట్టి ఐదు రోజులే.. కేటీ జకారియాను తొలగించిన ట్రంప్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఐదురోజులకే కేటీ జకారియాను ఆ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఆమె పనితీరుపై విమర్శలు రావడం, విద్యార్హతలకు సంబంధించి ప్రశ్నలు తలెత్తడం ఈ పరిణామానికి కారణాలుగా ప్రచారం జరుగుతోంది. కేటీ జకారియా ఈ నెల 12న వైట్‌హౌస్ మీడియా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి రోజే తొలిసారిగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆమె నిర్వహించిన ఈ సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది. కేవలం ముగ్గురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆమె సమాధానాలు ఇచ్చారు. అంతేకాకుండా, కొన్ని ప్రశ్నలకు బదులిచ్చే సమయంలో ఆమె తడబడటంతో పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

వివరాలు

విద్యార్హతలపై అనుమానాలున్నాయంటూ వార్తలు

మరోవైపు, తాను గతంలో న్యాయవాదిగా పనిచేశానని కేటీ ఓ సందర్భంలో వెల్లడించారు.అయితే ఆమె విద్యార్హతలపై అనుమానాలు ఉన్నాయంటూ వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ వంటి కీలకమైన ఉన్నత పదవిలో కొనసాగుతున్న ఆమె అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ పరిణామాలు ఆమె పదవిపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రెస్ సెక్రటరీ పదవిలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై మరోసారి ఆలోచించుకోవాలని కేటీ జకారియాకు సూచించినట్లు తెలిపారు.

వివరాలు

రాజకీయ వర్గాల్లో కీలక చర్చ

ఈ ఉద్యోగం ఆమెకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చని కూడా వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే కేటీని పదవి నుంచి తొలగించినట్లు వార్తలు వెలువడటం గమనార్హం.

అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు మరికొన్ని వారాలే సమయం ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైట్‌హౌస్‌లో కీలక పదవిలో ఉన్న వ్యక్తిని బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే తొలగించినట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

ADVERTISEMENT