H-1B Visa: హెచ్ 1బి వీసాలపై కఠిన నిబంధనలు .. భారతీయ టెక్కీల నెత్తిన పిడుగు
హెచ్ 1బి వీసాలపై పని చేస్తున్న ఐటి ఉద్యోగులకు పిడుగు లాంటి వార్త ఇది.ఈ వీసాలకు గడువు కేవలం 60 రోజులు మాత్రమే వుంటుంది. ఒక వేళ గడువు దాటి ఉంటే అది అమెరికా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని యుస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యు.ఎస్.సి.ఐ.సి)గురువారం అధికారికంగా ప్రకటనలో తెలిపింది. దీంతో టెక్ కంపెనీలైన గూగుల్ ,మెటా,డెల్, ట్విట్టర్,అమోజాన్, మైక్రో సాప్ట్ తదితర కంపెనీల్లో భారతీయ సంతతి ఉద్యోగులకు ఇరకాటంగా మారనుంది. ఉపాధి పేరుతో వలస వచ్చిన ఉద్యోగులకు ఈ నిబంధన తెలియకపోవచ్చని అటువంటి వారు ఎవరైనా నిర్ధేశిత గడువు 60 రోజులు ముగియగానే తప్పని సరిగా తమ దేశం విడిచి వెళ్లాల్సి వుంటుందని యు.ఎస్.సి. ఐ.సి స్పష్టం చేసింది.
అమెరికాలో అడుగు పెడుతోన్నభారతీయ యువతకు నిరాశ
టెక్ కంపెనీల్లో ఇప్పటికే మూత పడటం లేదా ఉద్యోగులకు ఉద్వాసన పలకటం,కొత్త రిక్రూట్ మెంట్లు లేకపోవడం జరుగుతోంది. ఈ తరుణంలో ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెడుతోన్నభారతీయ యువతకు నిరాశే ఎదురు అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 237 టెక్ కంపెనీలు మూత పడ్డాయి. దీంతో 58 వేల 499 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని గణాంకాలు చెపుతున్నాయి. H-1B VISA గడువు ముగిశాక కూడా యు.ఎస్ లో ఉండాలంటే కొన్ని షరతులకు లోబడి ఉండాలని యు.ఎస్.సి. ఐ.సి ఆ ప్రకటనలో తెలిపింది.
వలసేతురులుగా ఉన్నట్లైతే తమ స్టేటస్ ను మార్చాలని దరఖాస్తు
1. ఎవరైనా వలసేతురులుగా ఉన్నట్లైతే తమ స్టేటస్ ను మార్చాలని తాజాగా దరఖాస్తు చేయాలి. 2. అడ్జస్ మెంట్ స్టేటస్ ను కోరుతూ దరఖాస్తు చేయాలి. 3. ఇందుకు దారి తీసిన పరిస్ధితులు సమగ్రంగా వివరిస్తూ సదరు కంపెనీ నుంచి ఆధీకృత డాక్యుమెంట్ జత చేస్తూ తాజాగా దరఖాస్తు చేయాల్సి వుంటుంది. 4. పనికి మాలిన కారణాలు చూపి కంపెనీ మారటం ద్వారా లబ్ది పొందడం వంటి పొరపాట్లు చేయరాదు.
60 రోజుల్లోపు దేశాన్ని వదిలి వెళ్లాలి
5. వలసేతురులు ఎవరైనా నిర్దేశిత 60 రోజుల గడువు దాటి యు.ఎస్ లో ఉన్నట్లయితే వారికి అంతకు ముందు జారీ చేసిన వలసేతురుల హోదాను శాశ్వతంగా కోల్పోతారు. 6. ఒక వేళ తాజా నిబంధనలకు అనుగుణంగా వలసేతురులు ఉన్న్లట్లయితే ఎవరైతే అక్కడ వుండే వారు సైతం వలస వచ్చిన వారితో సహా 60 రోజుల్లోపు దేశాన్ని వదిలి వెళ్లాల్సి వుంటుంది. 7. H-1B వీసా పై వలస వచ్చిన వారు ఎవరైనా ఉంటే కొత్త H-1B వీసా ఫారం (1-129) పిటిషన్ కు దరఖాస్తు చేయవల్సి ఉంటుంది. 8. H-1B వీసా పై వచ్చిన వ్యక్తి నిర్దేశిత 60 రోజుల గడువులోగా తన వీసాను ఎల్-2గా మార్చుకోనే అవకాశం వుంటుంది.