Page Loader
Thailand: ఫోన్‌ కాల్‌ లీక్.. థాయ్‌లాండ్‌ ప్రధానికి పదవీ గండం..!
ఫోన్‌ కాల్‌ లీక్.. థాయ్‌లాండ్‌ ప్రధానికి పదవీ గండం..!

Thailand: ఫోన్‌ కాల్‌ లీక్.. థాయ్‌లాండ్‌ ప్రధానికి పదవీ గండం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా అధికారంలోకి వచ్చిన పదినెలల వ్యవధిలోనే రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

ఆమె ఓ పొరుగుదేశం నాయకుడితో చేసిన ఫోన్‌ సంభాషణ లీక్ కావడం వల్ల ఆమె పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటన ఆమె ప్రధానిగా రాజీనామా చేయాలని డిమాండ్లకు దారితీసింది.

అంతేకాదు, ఆమె నడిపిస్తున్న సంకీర్ణ ప్రభుత్వానికి కీలక భాగస్వామి అయిన పార్టీ మద్దతును ఉపసంహరించుకుంది. అసలు ఆ ఫోన్‌కాల్‌లో ఏం జరిగింది?

వివరాలు 

ఫోన్‌కాల్‌ వల్ల పెరిగిన వివాదం 

థాయ్‌లాండ్‌కు పొరుగున ఉన్న కంబోడియా దేశంలో హున్‌సేన్ అనే వ్యక్తి 2023 వరకు ప్రధాని పదవిలో ఉన్నారు.

ఆయన పదవి నుండి తప్పుకున్న తర్వాత ఆయన కుమారుడు హున్ మానెట్ ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే పదవిలో లేకపోయినా హున్‌సేన్‌కు అక్కడ రాజకీయాల్లో గణనీయమైన ప్రాధాన్యం ఉంది.

ఇటీవలి కాలంలో థాయ్‌లాండ్‌ ప్రధాని షినవత్రా ఆయనకు ఫోన్‌ చేశారు.

'అంకుల్‌' అంటూ ఆయనను సంబోధించిన ఆమె, థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితుల గురించి వివరించారు.

ఆ సమయంలో ఆమె తమ దేశ ఆర్మీ కమాండర్‌ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పడం గమనార్హం.

వివరాలు 

ఫోన్‌కాల్‌ వల్ల పెరిగిన వివాదం 

ఈ ఫోన్‌ సంభాషణ కొద్ది రోజులకే లీక్ కావడం తీవ్ర దుమారానికి దారితీసింది.

ఇప్పటికే థాయ్-కంబోడియా దేశాల మధ్య సంబంధాలు అంతగా బలంగా లేవు.

సరిహద్దు వివాదాలు వాటి మధ్య గాడిలో లేని సంబంధాలకు కారణమవుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో, ఒక దేశ ప్రధాని మరో దేశ మాజీ నేతతో ఇటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ సంఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆమె సొంత సంకీర్ణ భాగస్వాములే ఎదురు నిలిచారు.

వివరాలు 

మద్దతు ఉపసంహరణ - సంకీర్ణానికి సంక్షోభం 

షినవత్రా మాటలతో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ, కన్‌జర్వేటివ్ భూమ్‌జాయ్‌థాయ్‌ పార్టీ, ఆమె ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

దీంతో షినవత్రా ప్రభుత్వం మైనారిటీ స్థితిలోకి చేరింది. ప్రస్తుతం థాయ్ పార్లమెంట్‌లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించినట్టు సమాచారం.

దాంతో ప్రభుత్వ బలం గణనీయంగా తగ్గిపోయింది. పరిస్థితి ఇలా కొనసాగితే, షినవత్రా సంకీర్ణ ప్రభుత్వంలో తిరుగుబాటు జరుగుతుందన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అది జరిగితే, ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. దీంతో దేశంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

వివరాలు 

చరిత్ర సృష్టించిన యువ నేత - ఇప్పుడు సంక్షోభంలో 

థాయ్‌లాండ్‌ బిలియనీర్‌, మాజీ ప్రధాని తక్సిన్‌ షినవత్రా కుమార్తె అయిన పేటోంగ్టార్న్ షినవత్రా, 2023 ఆగస్టులో ప్రధాని పదవిని చేపట్టి దేశ చరిత్రలోనే 37 ఏళ్లకే అతి చిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

అలాగే, ఆమె రెండో మహిళా ప్రధానిగా కూడా చరిత్రలో నిలిచారు.

రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆమె, అందం, స్టైల్‌తో కూడిన తన వేషధారణ వల్ల "స్టైల్‌ ఐకాన్‌"గా, "బ్యూటిఫుల్‌ పీఎం"గా సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రజాదరణ పొందారు.

కానీ ఇప్పుడు ఆమె పాలన మిగతా పార్టీల మద్దతు లేకుండా కొనసాగుతుందా అన్నది సందేహాస్పదమవుతోంది.