Page Loader
Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా
లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా

Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 14, 2025
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

లాస్‌ ఏంజెలెస్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, అకాడమీ జనం 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు వెల్లడించింది. 'లాస్‌ ఏంజెలెస్‌లో సాగుతున్న మంటల కారణంగా ఓటింగ్‌ సమయం పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం' అని అకాడమీ సీఈవో బిల్‌ క్రేమర్‌, అధ్యక్షురాలు జానెట్‌ యాంగ్‌ చెప్పారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు జరగాల్సి ఉండగా, కార్చిచ్చు కారణంగా జనవరి 17కు వాయిదా పడింది. కానీ మంటలు ఇంకా తగ్గకపోవడంతో, ఆస్కార్‌ నామినేషన్లను 23న ప్రకటించనున్నట్లు వెల్లడించారు

Details

భారత్ నుంచి ఆరు చిత్రాలు

. లాస్‌ ఏంజెలెస్‌ చుట్టుపక్కల ప్రదేశాలలో జరుగుతున్న తీవ్రమైన కార్చిచ్చు కారణంగా హాలీవుడ్‌ పరిశ్రమతోపాటు అనేక కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. దీంతో ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని అకాడమీ నిర్ణయించింది. ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్ల బరిలో భారత్‌ నుంచి ఆరు చిత్రాలు నిలిచాయి. 'కంగువ' (తమిళం), 'గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌' (హిందీ, ఇంగ్లిష్‌), 'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' (మలయాళం), 'ది గోట్‌ లైఫ్‌' (హిందీ), 'సంతోష్‌' (హిందీ), ''స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌'' (హిందీ). ఈ చిత్రాలు ఆస్కార్‌ నామినేషన్లలో చోటు పొందితే, భారతీయ చిత్ర పరిశ్రమకు ఇది గొప్ప గౌరవంగా నిలుస్తుంది.