Loading...
Jensen Huang: జెన్సన్ హువాంగ్‌తో ప్రేమ సంబంధమే.. చైనా గూఢచర్యానికి ఆధారాల్లేవు : అమెరికా
జెన్సన్ హువాంగ్‌తో ప్రేమ సంబంధమే.. చైనా గూఢచర్యానికి ఆధారాల్లేవు : అమెరికా

Jensen Huang: జెన్సన్ హువాంగ్‌తో ప్రేమ సంబంధమే.. చైనా గూఢచర్యానికి ఆధారాల్లేవు : అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నిఘా వర్గాల తాజా అంచనాల ప్రకారం.. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌, వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌ మధ్య ఉన్న సంబంధానికి, చైనా గూఢచర్యానికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం ప్రేమ సంబంధమేనని, జెన్సన్ హువాంగ్‌ లేదా ఆయన సంస్థ ఎన్విడియాపై నిఘా పెట్టేందుకు చైనా ఆలిస్‌ను ఉపయోగించిందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అమెరికా నిఘా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత విషయాలు తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' కథనం ప్రచురించింది.

వివరాలు 

ఎంఎస్ఎస్‌ ఏజెంట్లతో ఆలిస్‌ సంప్రదింపులు

అమెరికా నిఘా అధికారులు కాంగ్రెస్‌ సిబ్బందికి ఇచ్చిన బ్రీఫింగ్‌లో ఈ విషయాలను వెల్లడించినట్లు సమాచారం.

చైనా చట్టాల ప్రకారం ఆ దేశ ప్రధాన నిఘా సంస్థ అయిన 'మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్యూరిటీ' (ఎంఎస్ఎస్‌) సమాచారం కోసం ఆలిస్‌ హువాంగ్‌ను సంప్రదించిన విషయం వాస్తవమేనని అధికారులు తెలిపారు.

దీంతో జెన్సన్‌తో ఆమెకు సంబంధం కొనసాగుతున్న సమయంలో ఆలిస్‌.. ఎంఎస్ఎస్‌ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు.

అయితే, ఆమె చైనాకు ఎలాంటి కీలక సమాచారాన్ని అందించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

ఇదే బ్రీఫింగ్‌లో ఆలిస్‌ భర్తగా చెప్పుకుంటున్న కంగ్‌ వీ.. ఎంఎస్ఎస్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

వివరాలు 

చిప్‌ల అక్రమ రవాణాపై విచారణ

ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి జెన్సన్‌ హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యానికి పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధారాలు ఈ ఆరోపణలకు మద్దతు ఇవ్వడం లేదని అమెరికా నిఘా వర్గాల అంచనా.

మరోవైపు, చైనా నిఘా సంస్థతో సంబంధాలు కలిగి ఉండటమే గూఢచర్యం కిందకు వస్తుందని కొందరు అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. అమెరికా ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించి ఎన్విడియా చిప్‌లను అక్రమంగా చైనాకు తరలించడంలో ఈ వ్యవహారానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి.

ఎన్విడియా బోర్డు కూడా ఈ అంశంపై అంతర్గత విచారణ చేపట్టింది.

ADVERTISEMENT

వివరాలు 

మెగాస్పీడ్‌పై అమెరికా వాణిజ్య శాఖ చర్యలు.. చిప్‌ల తరలింపుపై దర్యాప్తు

'రాయిటర్స్‌' కథనం ప్రకారం.. ఆలిస్‌ హువాంగ్‌కు చెందిన కంపెనీలు చైనాలో భారీ ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అధునాతన కంప్యూటింగ్‌ పరికరాల పేరుతో సుమారు 270 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2,498 కోట్లు)సమీకరించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆలిస్‌కు చెందిన సింగపూర్‌ కంపెనీ 'మెగాస్పీడ్‌'పై అమెరికా వాణిజ్య శాఖ చర్యలు తీసుకుంది.

సోమవారం ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.అయితే, ఈ వ్యవహారంతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని మెగాస్పీడ్‌ స్పష్టం చేసింది.

ఆలిస్‌ హువాంగ్‌ 2025 ఆగస్టులోనే కంపెనీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది.

మొత్తంగా,జెన్సన్‌ హువాంగ్‌ వ్యవహారంలో చైనా గూఢచర్యానికి సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు లభించకపోయినా..ఎన్విడియా చిప్‌ల అక్రమ రవాణా,చైనాకు సాంకేతిక పరికరాల తరలింపు అంశాలపై అమెరికా దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT