H-1B Visa: హెచ్-1బీ వీసాల జారీ విధానంలో అమెరికా కీలక మార్పులు: 2027 రిజిస్ట్రేషన్ సీజన్ నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వలస నిబంధనల్లో (H-1B Visa) కొత్త క్రమపద్ధతులు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (USCIS) ఈ మార్పులను ఫెడరల్ రిజిస్టర్‌లో అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త విధానం 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఫిబ్రవరి 27, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు హెచ్-1బీ వీసాలను ర్యాండమ్ లాటరీ విధానంలో మాత్రమే కేటాయిస్తే, కొత్త పద్ధతిలో అత్యధిక వేతనం, అధిక నైపుణ్యం ఉన్న అభ్యర్ధులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు వీసా పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వివరాలు
లాటరీ విధానంలో మార్పులు:
వేతన స్థాయిలు ఆధారంగా విభజన: అమెరికా కార్మిక శాఖ హెచ్-1బీ ఉద్యోగులను నాలుగు వేతన లెవల్స్‌లో విభజించింది: లెవల్-1: ఎంట్రీ లెవల్ లెవల్-2: మధ్యస్థాయి లెవల్-3: అనుభవజ్ఞులు లెవల్-4: అత్యధిక నైపుణ్యం వేతనం లాటరీలో ప్రవేశ అవకాశాలు: లెవల్-4: నాలుగుసార్లు, వీసా అవకాశం 61% లెవల్-3: మూడు సార్లు, వీసా అవకాశం 46% లెవల్-2: రెండు సార్లు, వీసా అవకాశం 31% లెవల్-1: ఒకసారి, గత విధానంతో పోలిస్తే 15% తగ్గిన అవకాశాలు
వివరాలు
ఎంట్రీ లెవల్ ఉద్యోగుల ర్యాండమ్ లాటరీ:
ఎంట్రీ లెవల్ ఉద్యోగుల కోసం ఇప్పటికీ ర్యాండమ్ విధానం కొనసాగుతుంది, కానీ వీరికి వీసా పొందే అవకాశాలు తక్కువ. భారతీయుల కోసం అమెరికా ఎంబసీ హెచ్చరిక: కొత్త విధానాలతో భారతీయ వలసదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్, ఇతర నిబంధనల కారణంగా హెచ్-1బీ, హెచ్-4 వీసా అపాయింట్‌మెంట్లు ఆలస్యమవుతున్నాయి. అమెరికా ఎంబసీ భారత్‌లో ముఖ్య సూచనలు చేసింది: అగ్రరాజ్య చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు,జరిమానాలు తప్పవు అక్రమ వలసలను అడ్డుకోవడం, సరిహద్దులను, పౌరులను రక్షించడం కోసం అమెరికా కఠినంగా కృషి చేస్తోంది