Bangladesh: బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాక్స్ బజార్ జిల్లాలో సముద్ర తీరాన ఉన్న ఓ రిసార్ట్లో మంటలు చెలరేగడంతో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మూడంతస్తుల చెక్క భవనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాక్స్ బజార్ జిల్లాలోని ఉఖియా ప్రాంతంలో ఉన్న తుప్తుప్ రెస్ట్రో అండ్ రిసార్ట్లో ఉదయం 7:25 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో మూడు అంతస్తుల చెక్క భవనం పూర్తిగా కాలిపోయింది.
వివరాలు
రిసార్ట్ ప్రాంతంలో విషాదకర పరిస్థితులు
ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందగా, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంతో రిసార్ట్ ప్రాంతంలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.