Maldives: మాల్దీవుల అధ్యక్షుడి నిర్వాకం.. 14 ఏళ్ల బాలుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మాల్దీవులు-భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ విషాదం చోటుచేసుకుంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మొండివైఖరి వల్ల 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎయిర్‌లిఫ్ట్ కోసం భారతదేశం ఇచ్చిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించడానికి అధ్యక్షుడు మహ్మద్ ముయిజు అనుమతించకపోవడంతో నిండు ప్రాణం బలయ్యాడు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసిన డోర్నియర్ విమానాలను మాల్దీవులకు భారత్ అందించింది.
మాల్దీవుల్లో మానవతా ప్రయోజనాల కోసం ఈ విమానాలను వినియోగిస్తారు.
రిమోట్ ప్రాంతమైన విల్మింగ్టన్లో బుధవారం రాత్రి 14ఏళ్ల బాలుడు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డాడు.
దీంతో ఆ బాలుడి కుటుంబం అతడికి చికిత్స అందించేందుకు మాల్దీవుల రాజధాని మాలేకి విమానంలో తరలించడానికి ఎయిర్‌లిఫ్ట్ కోసం అభ్యర్థించింది.
మాల్దీవులు
16 గంటల తర్వాత స్పందించిన వైమానిక దళం
విమానంలో బాలుడిని మాలే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు చాలాసార్లు ఫోన్లు చేసినా అధికారుల నుంచి స్పందన రాలేదు.
దాదాపు 16 గంటల తర్వాత తమ అభ్యర్థనను స్వీకరించారని, కానీ అప్పటికే ఆలస్యమైనట్లు బాలుడి తండ్రి పేర్కొన్నారు.
మాల్దీవుల వైమానిక దళానికి చెందిన విమానంలో మాలే ఆస్పత్రికి వెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయిందని, కొద్ది సేపటికే తమ కుమారుడు చనిపోయినట్లు బాలుడి తండ్రి వాపోయాడు. జరిగిన విషయాన్ని మొత్తం ఆయన మీడియాకు వెల్లడించారు.
ఈ ఘటనపై మాల్దీవుల ఎంపీ మైకేల్ నసీమ్ స్పందిచారు. భారతదేశం పట్ల అధ్యక్షుడికి ఉన్న కోపానికి ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టొద్దన్నారు.