Maldives : మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న మహమ్మద్ ముయిజ్జూ
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన ధృవీకరించారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా హయ్యర్ కమీషనర్ మును మహావార్ రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవులకు ఆహ్వానాన్ని అందించారు. మోదీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో ముయిజ్జును ప్రత్యక్షంగా చూడాలని కోరారన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇందుకు ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరవడం తనకు గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు.
మాల్దీవుల పర్యాటక రంగం కుదేలు
మాల్దీవులు,భారత్ నడుమ దౌత్యపరమైన ఉద్రిక్తలు నెలకొన్న సంగతి విదితమే. దీనితో ఆ దీవులకి వెళ్లే భారతీయులు తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు. దీంతో మాల్దీవుల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆ తర్వాత ముయిజ్జు పరిస్ధితులను చక్కదిద్దడానికి ప్రయత్నించారు.
ద్వైపాక్షిక సంబంధాలు
మాల్దీవులు-భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు ముయిజ్జు ఆసక్తిగా ఉన్నారు.మాల్దీవులు , భారతదేశం మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయన సంసిద్ధత చూపారు. మోడీతో కలిసి పనిచేయడానికి ముయిజు తన ఆసక్తిని కూడా వ్యక్తం చేశారు.ఈ పర్యటన ద్వారా సంబంధాలు సానుకూల దిశలో సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, ముయిజ్జూ X లో మోడీని అభినందించారు. "తమ రెండు దేశాలకు భాగస్వామ్య శ్రేయస్సు , స్థిరత్వం కోసం భాగస్వామ్య ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయడానికి సిద్ధమని ముయిజ్జు పేర్కొన్నారు. ముయిజ్జు భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. అంతకు ముందు చైనా పర్యటనకు వెళ్లి వచ్చారు ముయిజ్జు.