LOADING...
Covid vaccination: ఒక వ్యక్తికి 200 కంటే ఎక్కువ సార్లు కరోనా వ్యాక్సిన్.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు 

వ్రాసిన వారు Stalin
Mar 06, 2024
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడానికి అనేక మంది భయపడ్డారు. మూడో డోసు వేసుకోని వాళ్లు.. ఇప్పటికీ అనేక మంది ఉన్నారు. అయితే జర్మనీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 200 కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్ డోసులను తీసుకొని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. 62 ఏళ్ల ఆ జర్మనీకి చెందిన వ్యక్తిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఎక్కువ డోసులు తీసుకోవడం వల్ల అతని రోగనిరోధక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుంటున్నారు. వచ్చిన రిపోర్టులను నిశితంగా పరిశీలిస్తున్నారు. జర్మనీకి చెందిన ఈ వ్యక్తిపై లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో అధ్యయనం ప్రచురించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు