
Canada: భారత్‌తో సత్సంబంధాలపై మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ఎన్నికలకు ముందు మార్క్ కార్నీ భారత్‌తో సంబంధాలు మెరుగుపరచడానికి చేసిన ప్రకటనలు విశేషంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుతం కెనడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్క్ కార్నీ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ భారత్‌తో ఉన్న సత్సంబంధాలు తమకు చాలా ముఖ్యమైనవి.
అధికారంలోకి వస్తే, భారత్‌తో సంబంధాలు మెరుగుపరచాలని మనసులో ఉన్న ఆత్మనమ్మకంతో చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల భారత్, కెనడా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి.
ముఖ్యంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా. ట్రూడో గతంలో హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్యపై భారత్ సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలతో సంబంధాలు మరింత క్షీణించాయి.
Details
లిబరల్ పార్టీ మెజార్టీ సాధించే అవకాశం
ఈ నేపథ్యంలో మార్క్ కార్నీ, భారత్‌తో సంబంధాలు తిరిగి పునరుద్ధరించడంలో ఆసక్తి చూపిస్తున్నారు.
మార్క్ కార్నీ ప్రస్తుతం కెనడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న లిబరల్ పార్టీకి చెందిన నాయకుడిగా, భారతదేశంతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రపంచ ఆర్థికవ్యవస్థ పునర్నిర్మాణం సమయంలో, భారత్, కెనడా భాగస్వామ్య ఆర్థికవ్యవస్థను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.
ఈ ఎన్నికలు కెనడాలోని రాజకీయ పరిస్థితులలో కీలకమైన వాటిగా నిలిచాయి.
343 సభ్యుల పార్లమెంట్‌లో లిబరల్ పార్టీ అధిక మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయని తాజా పోల్స్ సూచిస్తున్నాయి.