LOADING...
US embassy: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద భారీ పేలుడు
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద భారీ పేలుడు

US embassy: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద భారీ పేలుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐరోపా దేశమైన నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటన సమయంలో భారీ శబ్దం వినిపించిందని, అనంతరం పెద్ద ఎత్తున పొగ వ్యాపించిందని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజధాని ఓస్లో (Oslo)లో ఉన్న అమెరికా ఎంబసీ ప్రవేశ ద్వారం వద్దే ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనలో ఎంబసీ భవనానికి స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.

Details

అధికారిక ప్రకటన వెలువడలేదు

పేలుడుకు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే నార్వేలోని యూఎస్‌ ఎంబసీ వద్ద పేలుడు సంభవించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement