Loading...
Strait of Hormuz: హర్మూజ్‌లో భారీ పేలుళ్లు.. సీమైన్స్‌ను ఢీకొట్టి ధ్వంసమైన రెండు చమురు ట్యాంకర్లు!
హర్మూజ్‌లో భారీ పేలుళ్లు.. సీమైన్స్‌ను ఢీకొట్టి ధ్వంసమైన రెండు చమురు ట్యాంకర్లు!

Strait of Hormuz: హర్మూజ్‌లో భారీ పేలుళ్లు.. సీమైన్స్‌ను ఢీకొట్టి ధ్వంసమైన రెండు చమురు ట్యాంకర్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు ముదురుతున్న వేళ, ఇరాన్ సముద్రంలో ఏర్పాటు చేసిన మందుపాతరలు (మైన్స్) ఇప్పుడు నౌకలకు కొత్త ముప్పుగా మారాయి. యుద్ధం ప్రారంభమైన సమయంలోనే ఇరాన్ హర్మూజ్ జలసంధిలో మందుపాతరలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లు ఆ మందుపాతరలను ఢీకొట్టడంతో భారీ పేలుళ్లు సంభవించినట్లు శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది.

వివరాలు

నాలుగు నౌకలను అడ్డుకున్నామని ఐఆర్‌జీసీ ప్రకటన

"కొద్దిసేపటి క్రితం హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు ఉన్న ప్రాంతం మీదుగా ప్రయాణించిన రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఐఆర్‌జీసీ తెలిపింది.

అంతేకాకుండా అదే జలమార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన మరో నాలుగు నౌకలను కూడా అడ్డుకున్నామని వెల్లడించింది.

ఏడోరోజు కొనసాగిన అమెరికా దాడులు

మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులు ఏడోరోజుకూ కొనసాగుతున్నాయి.

ఈ దాడుల కారణంగా దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. దీంతో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.

వివరాలు

ఇరాన్ తీవ్ర హెచ్చరిక

దాడులు మరో రెండు నుంచి మూడు రోజుల పాటు ఇదే విధంగా కొనసాగితే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతామని ఇరాన్ హెచ్చరించింది.

"మేము దీటుగా ప్రతిస్పందిస్తాం. మా ప్రతీకార చర్యల నుంచి ఏ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదని స్పష్టం చేసింది.

యూఎస్ స్థావరాలపై ప్రతీకార దాడులు

అమెరికా లక్ష్యాలపై ఇరాన్ ప్రతీకార దాడులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కువైట్, జోర్డాన్ దిశగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం.

దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

ADVERTISEMENT