LOADING...
Melinda Gates: ఎప్‌స్టీన్‌ సెక్స్‌ స్కాండల్‌లో బిల్‌గేట్స్‌పై ఆరోపణలు..  అందుకే బంధం ముగిసింది: మిలిందా
అందుకే బంధం ముగిసింది: మిలిందా

Melinda Gates: ఎప్‌స్టీన్‌ సెక్స్‌ స్కాండల్‌లో బిల్‌గేట్స్‌పై ఆరోపణలు..  అందుకే బంధం ముగిసింది: మిలిందా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్‌ కేసులో, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి రావడంపై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ స్పందించారు. బిల్‌గేట్స్‌ ఇతర మహిళలతో సన్నిహిత సంబంధాలున్నట్టు తెలిసినప్పుడు ఆమె తీవ్ర మానసిక కష్టాన్ని ఎదుర్కొన్నట్టు తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా వారి వివాహ జీవితం ముగిసినట్లు ఆమె తెలిపారు. మిలిందా గేట్స్ తన జీవితంలో ఆ సందర్భాన్ని చాలా బాధాకరంగా అనుభవించానని చెప్పారు. తమ మధ్య ఉన్న బంధాన్ని నిలిపేందుకు అవసరమైన విలువలను బిల్‌ గేట్స్‌ పాటించకపోవడం వల్లే విడాకులు తీసుకోవడం తప్పనిసరిగా అనిపించిందని పేర్కొన్నారు.

వివరాలు 

మూడు దశాబ్దాల వివాహ బంధానికి ముగింపు

అదేవిధంగా, ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ గురించి వస్తున్న ఆరోపణలకు సంబంధించి స్పందించాల్సినది బిల్‌గేట్స్‌ అని, తాను కాదు అని స్పష్టంగా చెప్పారు. ఫైల్స్‌లో బాధితులైన మహిళలకు న్యాయం జరగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్‌గేట్స్‌-మిలిందా గేట్స్‌ దంపతులు మూడు దశాబ్దాల వివాహ బంధానికి ముగింపు పలికారు. వారు 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి 20 సంవత్సరాలకు పైబడిన ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు సంబంధాలు ఉండడం నచ్చని మిలిందా ఆయన నుంచి విడాకులు తీసుకుందని ప్రముఖ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ అప్పట్లో ఓ కథనంలో పేర్కొంది.

వివరాలు 

ఆరోపణలను ఖండించిన గేట్స్ బృందం

అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ రష్యన్‌ మహిళలతో లైంగిక సంబంధం నెరిపాడని, ఎఫ్‌స్టీన్‌ ఆరోపణల ప్రకారం ఆయన సుఖవ్యాధులకు గురయ్యాడని పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా అసంబద్ధమైనవని పేర్కొంది.

Advertisement