Loading...
Midterm elections 2026:  అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు

Midterm elections 2026:  అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. న్యూయార్క్‌, న్యూజెర్సీ, వర్జీనియా, మైన్‌, కెంటకీ, వెర్మాంట్‌, న్యూహ్యాంప్‌షైర్‌, ఇండియానా, కనెక్టికట్‌ రాష్ట్రాల్లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఓటింగ్‌ మొదలైంది. పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ఈ ఎన్నికల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఆయా స్థానాలకు కాంగ్రెషనల్‌ జిల్లాల పరిధిలోని ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. సెనెట్‌లోని 35 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్‌ పదవులకు, రాష్ట్ర చట్టసభల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

వివరాలు 

డెమోక్రాట్లకు విజయావకాశాలు ఎక్కువ

అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు, ఇరాన్‌తో యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మధ్యంతర ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎన్నికల్లో డెమోక్రాట్లకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అత్యధిక సర్వేలు అంచనా వేస్తున్నాయి.

డెమోక్రాట్లు చట్టసభల్లో ఆధిక్యం సాధిస్తే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలకు అడ్డుకట్ట వేసే అవకాశం వారికి లభిస్తుంది.

ముఖ్యంగా ప్రతినిధుల సభలో ఆధిక్యం సాధించడం ద్వారా ట్రంప్‌ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT