LOADING...
Mojtaba Khamenei: ఇరాన్‌లో కొత్త నేత ఎంపిక పూర్తీ.. సుప్రీం లీడర్‌ గా మొజ్తాబా ఖమేనీ
ఇరాన్‌లో కొత్త నేత ఎంపిక పూర్తీ.. సుప్రీం లీడర్‌ గా మొజ్తాబా ఖమేనీ

Mojtaba Khamenei: ఇరాన్‌లో కొత్త నేత ఎంపిక పూర్తీ.. సుప్రీం లీడర్‌ గా మొజ్తాబా ఖమేనీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎట్టకేలకు ఇరాన్‌లో కొత్త సుప్రీం లీడర్‌ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. దేశ తదుపరి సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త నాయకత్వంపై ఇరాన్‌లో చర్చలు సాగుతున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో మొజ్తాబా ఖమేనీ గాయపడినట్లు సమాచారం వెలువడింది. అంతేకాకుండా, మొజ్తాబాకు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ

Advertisement