Loading...
Iran Attack In Hormuz: హర్మూజ్‌లో భారతీయుల నౌకపై దాడి.. వెలుగులోకి వీడియో
హర్మూజ్‌లో భారతీయుల నౌకపై దాడి.. వెలుగులోకి వీడియో

Iran Attack In Hormuz: హర్మూజ్‌లో భారతీయుల నౌకపై దాడి.. వెలుగులోకి వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్‌ దళాలు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణించే నౌకలకు తరచూ ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా యుద్ధం తీవ్రంగా కొనసాగిన తొలి నెలల్లో భారతీయ సిబ్బంది ఉన్న పలు ట్యాంకర్లపై క్షిపణి దాడులు, కాల్పులు జరిగినట్లు సమాచారం. ఏప్రిల్‌ 22న జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియోను భారత నావికుల సమాఖ్య ఫార్వర్డ్‌ సీమెన్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (FSUI) తాజాగా విడుదల చేసింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్‌ షిప్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళాలు లక్ష్యంగా చేసుకున్నట్లు వీడియో దృశ్యాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు 

కంటైనర్‌ షిప్‌లో 21 మంది భారతీయులు 

చిన్న బోట్లతో నౌకను చుట్టుముట్టిన ఐఆర్‌జీసీ దళాలు.. ఆ తర్వాత కాల్పులు జరిపినట్లు వీడియోలో కనిపించింది.

అంతేకాకుండా రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్లను కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీంతో నౌకలోని సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

కాల్పుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు వారు కంటైనర్ల మధ్యలో దాక్కున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి.

ఈ కంటైనర్‌ షిప్‌లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 21 మంది భారతీయులే కావడం గమనార్హం.

ఘటనకు సంబంధించిన వీడియోను FSUI ప్రధాని కార్యాలయం, కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖకు ట్యాగ్‌ చేసింది.

హర్మూజ్‌ జలసంధిలో పరిస్థితులు అంచనాలకు మించి ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది.

వివరాలు 

ఇరాన్‌ అధికారుల వద్ద భారత్‌ ఆందోళన

అయితే ఈ ఘటనలో నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడినట్లు ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత భారత షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ దాడిపై ఇరాన్‌ అధికారుల వద్ద భారత్‌ తన ఆందోళనలను వ్యక్తం చేసినట్లు తెలిపింది.

హర్మూజ్‌ జలసంధిలో చోటుచేసుకుంటున్న దాడుల్లో భారతీయ నావికులు కూడా తరచూ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28 తర్వాత హర్మూజ్‌లో జరిగిన దాడుల్లో కనీసం 15 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు భారతీయులేనని నివేదిక పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్‌ అధికారుల వద్ద భారత్‌ ఆందోళన

ప్రపంచ సముద్ర రవాణా రంగంలో భారతీయ నావికుల పాత్ర కీలకంగా ఉంది. సముద్రంలో విధులు నిర్వహించే నావికుల్లో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికుల్లో దాదాపు 12.2 శాతం మంది భారతీయులేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దీంతో హర్మూజ్‌ జలసంధిలో భద్రతా పరిస్థితులు భారతీయ నావికులకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నౌకను చుట్టుముట్టి ఇరాన్‌ దళాల కాల్పులు.. భయానక దృశ్యాలు వైరల్

ADVERTISEMENT