పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.
దేశంలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న సగాయింగ్ ప్రాంతంలోని ఒక గ్రామంపై ఘోరమైన వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడులను స్థానిక మీడియా ధృవీకరించింది.
దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఒక వర్గం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పజిగి గ్రామంలో నిర్వహిస్తుండగా ఉదయం 8 గంటల సమయంలో వైమానిక దాడులు చేసినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్ ధృవీకరించారు.
మయన్మార్
ఫైటర్ జెట్ నుంచి బాంబుల వర్షం
దాదాపు 150 మంది గుంపుపైకి ఫైటర్ జెట్ నేరుగా బాంబులు వర్షం కురిపించిందని ప్రత్యేక్ష సాక్షి ప్రముఖ న్యూస్ ఎజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు.
మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు ఉన్నారని, చనిపోయిన వారిలో స్థానికంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర ప్రతిపక్ష సంస్థల నాయకులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
సగాయింగ్ ప్రాంతం దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో ఉంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా అక్కడ నెలల తరబడి తీవ్రమైన పోరాటం జరుగుతోంది.