ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు
జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల అనంతరం లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. లెబనాన్‌లోని గాజా స్ట్రిప్ లక్ష్యంగా ఇజ్రాయెల్ గురువారం రాత్రి బాంబులతో విరుచుకుపడింది. జెరూసలేంలోని అల్-అక్సా మసీదు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో మసీదులో యూదులు మేకను బలిచ్చేందుకు చేసిన ప్రయత్నం తాజా ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘర్షణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాలస్తీనా అతివాద సంస్థ హమాస్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై బుధవారం రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై గురువారం రాత్రి వైమానిక దాడులు చేసినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇజ్రాయెల్‌లో ఇద్దరికి గాయాలు
లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌లో రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఉత్తర గాజా నగరమైన బీట్ హనౌన్, దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్ సమీపంలో ఉన్న సొరంగాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ రాకెట్లను ప్రయోగించింది. అతివాద సంస్థ 'హమాస్' భద్రతా ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్‌పై హమాస్ సంస్థ చేసిన దాడిలో ఇద్దరు గాయపడ్డారని, కొంత ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.