Loading...
Iran: అది డ్రోనా.. లేక విమానమా? ఇరాన్ ఆకాశంలో మిస్టీరియస్ యూఎఫ్ఓ
అది డ్రోనా.. లేక విమానమా? ఇరాన్ ఆకాశంలో మిస్టీరియస్ యూఎఫ్ఓ

Iran: అది డ్రోనా.. లేక విమానమా? ఇరాన్ ఆకాశంలో మిస్టీరియస్ యూఎఫ్ఓ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో గుర్తుతెలియని ఓ వస్తువు ఎగురుతూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వస్తువు డ్రోన్‌ అని కొందరు చెబుతుండగా.. సాధారణ విమానం అయి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. అసలు అది ఏమిటన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. గుర్తుతెలియని వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించినప్పుడు వాటిని సాధారణంగా యూఎఫ్ఓ (UFO-Unidentified Flying Object)గా పేర్కొంటారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో టెహ్రాన్ ఆకాశంలో ఈ మిస్టీరియస్ వస్తువు కనిపించడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

వివరాలు 

వైరల్ వీడియోలో ఏం కనిపించింది?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వస్తువు పలు లైట్ల వెలుగులతో ఆకాశంలో కదులుతూ కనిపిస్తోంది.

అయితే అది ఎంత పెద్దది? ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? కెమెరాకు ఎంత దూరంలో ఉంది? అనే వివరాలను మాత్రం వీడియో ఆధారంగా ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు.

ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడ్డిట్‌లోనూ ఈ వీడియోపై చర్చ జరుగుతోంది. టెహ్రాన్ నుంచి మరిన్ని ఫుటేజీలు బయటకు రావచ్చని ఓ యూజర్ పేర్కొన్నట్లు సమాచారం.

వివరాలు 

మిస్టీరియస్ యూఎఫ్ఓ.. రకరకాల వాదనలు

వైరల్ అవుతున్న వస్తువును కొందరు డ్రోన్‌గా భావిస్తున్నారు.దానికి కనిపిస్తున్న లైట్లు, కదలికలను పరిశీలించి వారు ఈ అభిప్రాయానికి వచ్చారు.

అయితే ఇప్పటివరకు అది డ్రోన్ అని నిర్ధారించే ఆధారాలు ఏవీ వెలుగులోకి రాలేదు.

మరికొందరు మాత్రం అది సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్ అయి ఉండొచ్చని అంటున్నారు.

దూరం, కెమెరా కోణం కారణంగా సాధారణ విమానం కూడా వింతగా కనిపించే అవకాశం ఉందని వారి వాదన.

అయితే ఇప్పటివరకు ఏ విమానయాన సంస్థ కూడా ఈ వస్తువుపై స్పందించలేదు. అది విమానమేనని అధికారికంగా ప్రకటించలేదు.

ఇక మరికొందరు మాత్రం అది డ్రోన్‌గానీ, విమానంగానీ కాదని.. గాలిపటం అయి ఉండొచ్చని చెబుతున్నారు.

ముఖ్యంగా వీడియోలో కనిపిస్తున్న తీరు ఎల్‌ఈడీ లైట్లు అమర్చిన గాలిపటంలా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అధికారిక వివరణ లేకపోవడంతో..

వైరల్ అవుతున్న ఈ యూఎఫ్ఓ వీడియోపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.

దీంతో అది ఏమిటన్న దానిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

అధికారికంగా ధ్రువీకరణ వచ్చే వరకు డ్రోన్, విమానం, గాలిపటం వంటి వాదనల్లో ఏదీ నిర్ధారించలేని పరిస్థితి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్‌లో గతంలోనూ యూఎఫ్ఓ కలకలం

టెహ్రాన్ ఆకాశంలో ఇలాంటి గుర్తుతెలియని వస్తువు కనిపించడం ఇదే తొలిసారి కాదు.

సుమారు 50ఏళ్ల క్రితం కూడా ఇరాన్ రాజధానిలో ఇలాంటి ఘటన నమోదైంది.

1976 సెప్టెంబరు 19న టెహ్రాన్ ఆకాశంలో ఓ వింత వస్తువును చూశామని అప్పటి ఇరాన్ అధికారులు, స్థానిక ప్రజలు వెల్లడించారు.

ఆ ఘటన అప్పట్లో కూడా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.ఇప్పుడు దశాబ్దాల తర్వాత అదే నగర ఆకాశంలో మరో గుర్తుతెలియని వస్తువు కనిపించడంతో పాత ఘటన మరోసారి చర్చకు వచ్చింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న వస్తువు అసలు ఏమిటన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.

దీనిపై అధికారులు లేదా సంబంధిత విమానయాన సంస్థల నుంచి అధికారిక సమాచారం వెలువడితేనే వాస్తవం ఏమిటనేది తేలే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న ఆ క్లిప్‌ ఇదే..  

ADVERTISEMENT