Page Loader
Hage Geingob: క్యాన్సర్‌తో నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ కన్నుమూత 
Hage Geingob: క్యాన్సర్‌తో నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ కన్నుమూత

Hage Geingob: క్యాన్సర్‌తో నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Feb 04, 2024
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గింగోబ్ పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున మృతి చెంందినట్లు నమీబియా ప్రెసిడెన్సీ తెలిపింది. 2015లో ప్రధానమంత్రిగా గింగోబ్ ఎన్నికయ్యారు. అంతకుముందు ఏడాది ప్రోస్టేట్ క్యాన్సర్‌ నుంచి కోలుకున్నారు. నమీబియాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 1990లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నమీబియాలో స్వాపో పార్టీనే అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు చనిపోవడంతో ఆయన స్థానంలో నంది-నైత్వాను ఎంపిక చేశారు. ఆమె ప్రస్తుతం నమీబియా ఉపప్రధాన మంత్రిగా ఉన్నారు, ఆమె గెలిస్తే ఆ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు అవుతారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నమీబియా ప్రెసిడెన్సీ ట్వీట్