Nepal: నేపాల్‌లో షాకింగ్ నిర్ణయం.. 1,500 నియామకాలు రద్దు
వ్రాసిన వారు
Moogati Shabari
May 05, 2026
10:44 am
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాల కాలంలో జరిగిన దాదాపు 1,500 రాజకీయ నియామకాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ రద్దు చేసిన నియామకాలన్నీ దేశంలో నాయకత్వ మార్పు జరిగిన మార్చి 26కు ముందే నియామకం అయ్యాయి.
వివరాలు
ప్రజా సంక్షేమంపై ప్రభావం...
నేపాల్‌లో జెన్‌జీ నిరసనల తరువాత ఈ సంవత్సరం మార్చి 5న జరిగిన ఎన్నికల్లో బాలేంద్ర షా నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వాల సమయంలో జరిగిన వివిధ రాజకీయ నియామకాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజా సంక్షేమంపై కూడా ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.