Loading...
Nepal Flood: నేపాల్‌లో దారుణం.. క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామం
నేపాల్‌లో దారుణం.. క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామం

Nepal Flood: నేపాల్‌లో దారుణం.. క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌ను వరదలు వణికిస్తున్నాయి. వరద బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వరద.. ఓ నదీ తీర గ్రామాన్ని క్షణాల్లో ముంచెత్తింది. భారీగా వచ్చిన బురదతో కూడిన వరదనీటి ధాటికి ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. భోటేకోశి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. నదులు పొంగిపొర్లడంతో నీరు, బురద జనావాసాల్లోకి దూసుకొచ్చాయి. చూస్తుండగానే నదీ తీర ప్రాంతం మొత్తం బురదమయంగా మారిపోయింది. అనంతరం వరద ప్రవాహం దిగువ ప్రాంతాల వైపు కొనసాగింది. ఈ భారీ విపత్తులో 1,400 మందికి పైగా ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 392 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.

వివరాలు

వరదల తాకిడికి వందలాది వంతెనలు ధ్వంసం..

వరదల తాకిడికి వందలాది వంతెనలు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి.

దీంతో సహాయక, గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

హిమానీనదం నుంచి మంచు విరిగిపడటం వల్లే ఈ ఆకస్మిక వరద సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒక దశలో త్రిశూలి నదిలో నీటిమట్టం కేవలం అరగంటలోనే 9 మీటర్ల వరకు పెరిగినట్లు ఖాట్మండులోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెన్‌ డెవలప్‌మెంట్‌ నిపుణులు తెలిపారు.

వివరాలు

రాసువా జిల్లాలో సహాయక, పునరావాస చర్యలు..

ప్రస్తుతం రాసువా జిల్లాలో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో నేపాల్‌లో 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది.

ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించినట్లు తెలిపింది.

ఆచూకీ తెలియని వారిలో కైలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన పలువురు ఉన్నారు.

అలాగే త్రిశూలి-1 విద్యుత్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో..

ADVERTISEMENT