Nepal: వివాదాస్పద మ్యాప్‌తో కొత్త రూ.100 నోట్లు విడుదల చేసిన నేపాల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-నేపాల్ మధ్య దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను చేర్చిన మ్యాప్‌తో, నేపాల్ కేంద్ర బ్యాంకు (నేపాల్ రాష్ట్ర బ్యాంక్-ఎన్‌ఆర్‌బీ) గురువారం కొత్త రూ.100 నోటును విడుదల చేసింది. 2024లో ముద్రితమైందని చూపించిన ఈ నోటు వెనుక భాగంలో, మధ్యలో లేత ఆకుపచ్చ రంగులో నేపాల్ సవరించిన మ్యాప్ కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఎన్‌ఆర్‌బీ ప్రతినిధి మాట్లాడుతూ.. తమ రూ.100 నోట్లపై ఇంతకుముందు కూడా దేశ మ్యాప్ ఉండేదని, 2020లో ప్రభుత్వం ప్రకటించిన సవరించిన మ్యాప్ ప్రకారం ఇప్పుడు కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
వివరాలు
భారత్ తీవ్ర నిరసన
భారత్ ఇవి తమ భూభాగాలని ఎప్పటి నుంచో చెబుతున్నా, ఈ మూడు ప్రాంతాలను తమ దేశ సరిహద్దుల్లో ఉన్నట్లు చూపిస్తూ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం 2020లో కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. దీనిపై అప్పట్లోనే భారత్ తీవ్ర నిరసన తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాలాపానీ-లిపులేఖ్ తో నేపాల్ కొత్త రూ.100 నోట్లు
Nepal issues new NPR 100 banknote featuring updated map including Indian territories
— ANI Digital (@ani_digital) November 27, 2025
Read @ANI Story | https://t.co/Xku9CDuctg#Nepal #Banknotes #NPR pic.twitter.com/5hW5t3f6ti