Loading...
Netanyahu Calls PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్‌.. తాజా పరిస్థితులపై చర్చ
తాజా పరిస్థితులపై చర్చ

Netanyahu Calls PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్‌.. తాజా పరిస్థితులపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌-ఇజ్రాయెల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇప్పటివరకు నమోదైన పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాణిజ్యం, భద్రతతో పాటు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై వారు చర్చించినట్లు తెలిపింది. అలాగే పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రాంతీయ పరిణామాలపై కూడా ఇద్దరు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

వివరాలు 

యెమెన్‌లో హూతీల దాడులు.. 30 మంది సైనికులు మృతి

యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులు మరోసారి సైనిక స్థావరాలపై దాడులకు దిగారు.

మారిబ్‌, హధ్రామౌత్‌ ప్రాంతాల్లో ఉన్న సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, రాకెట్లతో దాడులు నిర్వహించారు.

ఈ ఘటనల్లో 30 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు యెమెన్‌ అధికారులు తెలిపారు. మరో 50 మంది సైనికులు గాయపడినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT